Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్ కల్యాణ్ నన్ను తిట్టిన మాట నిజమే.. కానీ కొట్టలేదు..!?: షకలక శంకర్ చెప్పేది నిజమా?!

పవన్ కల్యాణ్ నన్ను తిట్టిన మాట నిజమే.. కానీ కొట్టలేదు..!?: షకలక శంకర్ చెప్పేది నిజమా?!
, శనివారం, 28 మే 2016 (18:02 IST)
సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ సమయంలో షకలక శంకర్‌ను పవన్ కల్యాణ్ కొట్టారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. దర్శకుడితో పాటు యూనిట్ సభ్యులను ఇబ్బంది పెట్టడంతో పాటు.. టైమింగ్ పాటించకపోవడం వంటి కారణాలచేత పవన్ కల్యాణ్ షకలక శంకర్‌ చెంప చెల్లుమనిపించారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగింది.

అయితే ఈ వార్తల్ని శంకర్ కూడా నిజమేనన్నాడు. పవన్ కల్యాణ్ తనను తిట్టిన మాట నిజమే కానీ కొట్టలేదని సమర్థించుకున్నాడు. ఇంకా పెద్దవాళ్లతో.. డైరక్టర్‌గా సరిగ్గా మసలుకోవాలని సూచించారని షకలక శంకర వెల్లడించారు.  
 
ఇకపోతే.. జబర్దస్త్ ప్రోగ్రామ్ నుంచి షకలక శంకర్ వచ్చేయడానికి కూడా డైరక్టర్‌తో గొడవపడటమే కారణమని టాక్. దర్శకుడితో గొడవ ఆ కార్యక్రమంలో పాల్గొనే వారిపై సెటైర్లు వేసి ఎగతాళి చేయడం వంటి కారణాల చేత అతనిని ఆ ప్రోగ్రామ్ నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. అయితే సర్దార్ గబ్బర్ సింగ్ మాత్రం షూటింగ్ స్పాట్‌లో శంకర్ తాట తీశాడని సినీ జనం అంటున్నారు. 
 
పవన్ కల్యాణ్ తిట్టారనే మాట నిజమని ఒప్పుకున్న శంకర్.. తన ఇమేజ్ కోసం కొట్టాడనే మాటను దాస్తున్నాడని కూడా ఫిలిమ్ నగర్ వర్గాల్లో కామెంట్స్ వస్తున్నాయి. అయితే పవన్ కల్యాణ్ చెంపదెబ్బ మహిమో ఏమో కానీ.. తాను ఫుల్లుగా మారిపోయానని.. కేవలం కెరీర్‌పైనే దృష్టిపెట్టానని చెప్తున్నాడు. ఇకనైనా జాగ్రత్తగా ఉండే సరి..!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌లో నందమూరి బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’రెండో షెడ్యూల్!