Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఛాతర్ పూర్ ఫాంహౌస్‌లో షాహిద్ కపూర్ పెళ్లి వేడుక: సంగీత్ అదుర్స్

ఛాతర్ పూర్ ఫాంహౌస్‌లో షాహిద్ కపూర్ పెళ్లి వేడుక: సంగీత్ అదుర్స్
, మంగళవారం, 7 జులై 2015 (11:47 IST)
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, ఢిల్లీ అమ్మాయి మీరా రాజ్ పుత్‌లు ఓ ఇంటివారు కానున్నారు. వీరిద్దరి వివాహ వేడుకలో భాగంగా సంగీత్ వేడుక ధూమ్ ధామ్‌గా జరిగంది. ఎరుపు రంగు కుర్తా, నలుపు చుడీదార్‌లో షాహిద్ మెరిసిపోగా, అతనికి కాబోయే భార్య మీరా గోల్డెన్ బోర్డర్ తో ఉన్న పసుపురంగు లెహంగాలో తళుక్కుమన్నది. సంగీత్ వేదికపై వారిద్దరూ కలసి డాన్స్ చేస్తున్న ఫోటోను షాహిద్ స్నేహితుడు, ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఇప్పుడది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 
 
సోమవారం రాత్రి ఢిల్లీలోని ఓ హోటల్లో గ్రాండ్‌గా జరిగిన సంగీత్‌కు షాహిద్ తండ్రి పంకజ్ కపూర్, సుప్రియా పాఠక్ (షాహిద్ సవతి తల్లి), షాహిద్ తల్లి నీలిమా అజిమ్, తమ్ముళ్లు, ఇతర కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. ఢిల్లీలో మీరా కుటుంబానికి చెందిన ఛాతర్ పూర్ ఫాంహౌస్‌లో మంగళవారం ఏడు గంటల తరువాత షాహిద్, మీరాల వివాహం జరగనుంది.

Share this Story:

Follow Webdunia telugu