Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రయ్ రయ్ మంటూ సైకిళ్లపై సల్మాన్, షారూఖ్ రైడింగ్.. ట్విట్టర్లో ఫోటోలు.. లైకులో లైకులు!

సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్‌ల మధ్య పచ్చిగడ్డేస్తే భగ్గుమంటుందా అనేట్టుండేది ఒకప్పుడు వ్యవహారం. కానీ ఇప్పుడు పూర్తిగా భిన్నం. ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహం కనిపిస్తోంది. తాజాగా ఈ ఇద్దరు హీరోలు చెట్టాపట్టాలేస

రయ్ రయ్ మంటూ సైకిళ్లపై సల్మాన్, షారూఖ్ రైడింగ్.. ట్విట్టర్లో ఫోటోలు.. లైకులో లైకులు!
, శనివారం, 2 జులై 2016 (12:52 IST)
సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్‌ల మధ్య పచ్చిగడ్డేస్తే భగ్గుమంటుందా అనేట్టుండేది ఒకప్పుడు వ్యవహారం. కానీ ఇప్పుడు పూర్తిగా భిన్నం. ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహం కనిపిస్తోంది. తాజాగా ఈ ఇద్దరు హీరోలు చెట్టాపట్టాలేసుకుని ముంబై రోడ్లపై షికార్లు కొడుతున్నారు.

అర్ధరాత్రి సమయంలో వీరిద్దరూ రెండు సైకిళ్లు తీసుకుని రోడ్లపై రైడింగ్‌లు కొడుతూ ఎంజాయ్ చేశారు. వీరిలా రోడ్డుపై షికార్లు కొట్టడం మీడియాకు తెలిసిందో లేదో రయ్ రయ్ మంటూ వచ్చి ఇద్దరిని కెమెరాల్లో బంధించారు. కాగా, ఇదే విషయాన్ని షారుఖ్ ట్విట్టర్‌లో పేర్కొంటూ 'భాయ్ భాయ్ ఆన్ బైక్ బైక్... నో పొల్యూషన్' అంటూ పోస్టు పెట్టాడు. 
 
అలాగే, తమ ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. ఇది వారి అభిమానులను ఆకట్టుకుంటోంది. స్టార్ హీరోలైన వీరిద్దరూ గతంలో మంచి స్నేహితులు, విభేదాల కారణంగా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. రెండేళ్ల కిందట ఈద్ సందర్భంగా కలుసుకున్న వీరిద్దరూ పలు సందర్భాల్లో ఇలా అభిమానులను ఆనందింపజేస్తున్నారు.

అంతేకాకుండా.. సల్మాన్ తన లేటెస్ట్ మూవీ 'సుల్తాన్'లో షారుఖ్‌పై చెప్పిన ఓ డైలాగ్.. కింగ్ ఖాన్‌పై అతడికున్న అభిమానాన్ని చాటిచెప్పింది. తాజాగా రిలీజైన సుల్తాన్ సినిమా డైలాగ్ ప్రోమోలో నిన్ను నువ్వు షారుఖ్ ఖాన్ అని ఫీలవుతున్నావా అని తనని ప్రశ్నించిన కోచ్‌కి సల్మాన్ ఖాన్ చెప్పిన సమాధానం ఇద్దరి మధ్య ఉన్న ఎడబాటును మరింతగా తగ్గించింది.
 
గతంలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ పలుమార్లు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తన అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. ముఖ్యంగా చెప్పాలంటే.. సల్మాన్ ఖాన్‌పై, ఆయన అభిమానులపై అసభ్యకర వ్యాఖ్యలు చేయవద్దని, అభ్యంతరకరమైన పోస్టులు పెట్టవద్దని ఫ్యాన్స్‌కు సూచించిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం వీరిద్దరి ఫొటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంచు వారసుడేంటీ.. పానీపూరీ అమ్మడం ఏంటాని ఆశ్చర్చపోతున్నారా?