Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికా ఎయిర్‌పోర్టులో షారూక్ ఖాన్‌కు అవమానం.. ఎందుకని?

బాలీవుడ్‌ స్టార్‌ షారూఖ్‌ ఖాన్‌కు అమెరికాలో మరోసారి అవమానం ఎదురైంది. ఆయన్ని అమెరికాలోని లాస్ ఏంజిల్స్ విమానాశ్రయంలో తనిఖీల పేరిట రెండు గంటల సేపు నిలిపి వేశారు. వరుసగా ఆయనకు అమెరికాలో అవమానాలు తప్పడం

అమెరికా ఎయిర్‌పోర్టులో షారూక్ ఖాన్‌కు అవమానం.. ఎందుకని?
, శుక్రవారం, 12 ఆగస్టు 2016 (09:14 IST)
బాలీవుడ్‌ స్టార్‌ షారూఖ్‌ ఖాన్‌కు అమెరికాలో మరోసారి అవమానం ఎదురైంది. ఆయన్ని అమెరికాలోని లాస్ ఏంజిల్స్ విమానాశ్రయంలో తనిఖీల పేరిట రెండు గంటల సేపు నిలిపి వేశారు. వరుసగా ఆయనకు అమెరికాలో అవమానాలు తప్పడం లేదు. ఇప్పటికే పలుమార్లు ఆ దేశానికి వెళ్లిన షారూక్‌ను అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు ఎయిర్ పోర్టులో తనిఖీల పేరిట అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. 
 
ఆ ఘటన నుండి తేరుకోకముందే.... శుక్రవారం ఉదయం అమెరికాలో ల్యాండైన షారూక్‌ను అక్కడి భద్రతాధికారులు మరోమారు అదుపులోకి తీసుకున్నారు. సుహానా, ఆర్యన్‌లతో కలిసి అమెరికాలో దిగిన వెంటనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోవడంతో ఆవేదన చెందిన షారూక్ ఖాన్ స్వయంగా ఈ విషయాన్ని సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. అంతేకాదు అమెరికాకు వెళ్లిన ప్రతిసారీ తనకు ఇబ్బందులు ఎదురవుతున్నాడని వాపోయాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐశ్వర్యారాయ్ ఇంత అందంగా ఉంటే... చూసిన మలేషియా యువత చెడిపోతారు... ఎవరన్నారు...?