Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆదాశర్మకు ఎప్పుడూ మ్యారేజ్ బ్రేకప్ రోల్సేనా..? వేరే ఇవ్వరా?

ఆదాశర్మకు ఎప్పుడూ మ్యారేజ్ బ్రేకప్ రోల్సేనా..? వేరే ఇవ్వరా?
, గురువారం, 1 అక్టోబరు 2015 (17:58 IST)
టాలీవుడ్ గ్లామర్ తార ఆదాశర్మకు అందం ఉన్నా.. ఆనందం దక్కట్లేదు. ఒక్క మంచి హిట్ కొట్టేందుకు నానా ఇబ్బందులు పడుతోంది. హాట్ ఫోజులు, లిప్ లాకులు ఇచ్చినా అమ్మడు నటనకు ఆమడ దూరంలోనే ఉంది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్- నితిన్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకునే సినిమాలో ఆదా శర్మ నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదాశర్మపై మ్యారేజ్ బ్రేకప్ గర్ల్ అనే ముద్ర పడిపోయింది. 
 
ఎలాగంటే..? నటనా పరంగా ఆకట్టుకోలేకపోతున్న ఆదా శర్మ.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన సన్నాఫ్ సత్యమూర్తిలోనూ పెళ్లి బ్రేకప్ అయ్యే హీరోయిన్‍‌గానే కనిపించింది. ప్రస్తుతం ఇటీవలే విడుదలైన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలోనూ హరీష్ శంకర్ కూడా మ్యారేజ్ బ్రేకప్ అయ్యే హీరోయిన్‌గానే చూపించాడు. దీంతో ఆదాశర్మకు ఇలాంటి రోల్సే ఇస్తారా? వేరే రోల్స్ ఇవ్వరా? అనే దానిపై సినీ ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది. మరి ఆదాశర్మ ఏమంటుందో?

Share this Story:

Follow Webdunia telugu