Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చీర కడితే నిజంగా ఎవరైనా స్టారే... విదేశాల్లో అలాగే చూస్తారు.. విద్యాబాలన్

చీర కడితే నిజంగా ఎవరైనా స్టారే... విదేశాల్లో అలాగే చూస్తారు.. విద్యాబాలన్
, శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (08:16 IST)
ఒకప్పుడు పగలూ రాత్రీ చీరలో కన్పించేవారని నైట్‌ డ్రెస్‌లు లేవని, చీరలోని అందం మరెక్కడా లభించదని బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ అన్నారు. విదేశాల్లో చీర కడితే స్టార్‌లా చూస్తారని తెలిపారు. తన పుట్టిన రోజు నాడు కంజీవరం చీరలు బహుమతిగా ఇవ్వాలని కుటుంబ సభ్యులను కోరేదానని చెప్పారు. తాను విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి వారికి చీరలను బహుకరిస్తుంటానని పేర్కొన్నారు. 
 
ఫిక్కి లేడీస్‌ ఆర్గనైజేషన్‌ గురువారం బంజారాహిల్స్‌ పార్క్‌ హయత్‌లో 'చేనేత వస్త్రాలకు పూర్వ వైభవం'పై నిర్వహించిన ఇష్టాగోష్టిలో విద్యాబాలన్‌ పాల్గొన్నారు. తనకు చేనేత చీర ధరించడం నచ్చుతుందన్నారు. చీరల కోసం ప్రత్యేకంగా షాపింగ్‌ చేయలేదని.. హైదరాబాద్‌లోని స్నేహితులను కోరితే వారే చేనేత చీరలను పంపేవారని చెప్పారు. తెలుగు చిత్రసీమలో మంచి అవకాశం కోసం ఎదరుచూస్తున్నానని, టీవీ షోకు సంబంధించి చర్చలు నడుస్తున్నాయన్నారు. 
 
నగరంలో చాలా ప్రాంతాలు తనకు తెలుసునని నాంపల్లి, చార్మినార్‌, గోల్కొండ, రామోజీ ఫిల్మ్‌సిటీలో గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ మెలకువలతో ప్రాచుర్యం తీసుకొస్తున్న ఫ్యాషన్‌ డిజైనర్‌ సంజయ్‌ గార్గ్‌ మాట్లాడారు. సులువుగా చీరను ధరించేలా రెడీమెడ్‌ చీరను డిజైన్‌ చేయాలని ఫిక్కీ సభ్యులు సంజయ్‌కు సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu