Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'సర్కార్‌'గా మారనున్న సర్దార్.. పవర్ స్టార్ మూవీకి కొత్త టైటిల్ సూటవుతుందా..?

'సర్కార్‌'గా మారనున్న సర్దార్.. పవర్ స్టార్ మూవీకి కొత్త టైటిల్ సూటవుతుందా..?
, శనివారం, 1 ఆగస్టు 2015 (12:19 IST)
సినీ పరిశ్రమలో నెలకొన్న పోటీని తట్టుకోడానికి సినిమా ప్రారంభంలో పూజా కార్యక్రమం నుంచి విడుదల తేదీ వరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అందులో అతి కీలకమైనది సినిమా టైటిల్ ఎంపిక. ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో పాటు, ఎటువంటి సమస్యలకు దారితీయని విధంగా కూడా సినిమా టైటిల్ ఉండాలి. ఒక సినిమాకు ఉపయోగించే టైటిల్ అంతకు ముందు ఎవరూ రిజిస్టర్ చేయకుండా ఉండాలి. ఇన్ని సమస్యలు ఉండడంతో మునుపటి వలే సినిమా ప్రారంభంలోనే టైటిల్‌ను నిర్ణయించడం లేదు. 
 
గతంలో అయితే సినీ టైటిల్‌తోనే షూటింగ్ ప్రారంభం అయ్యేది. అయితే ఆ తర్వాత ట్రెండ్ మారి సంగం సినిమా పూర్తయ్యాక టైటిల్‌ని ప్రకటిస్తూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా సినిమా షూటింగ్ పార్ట్ అంతా పూర్తయ్యాకగానీ సినిమా పేరును బయటకు తెలపడం లేదు. దీనికి కారణం మంచి పేరు చిక్కకపోవడమే అని పలువురు తెలుపుతున్నారు. ఇప్పుడు ఆ సమస్య  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు వచ్చిందట. 
 
ఆ మధ్య పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రం ఎంతటి స్థాయిలో రికార్డు కొట్టిందో తెలిసిన విషయమై. ఇప్పుడు పవన్ తాజాగా ఈ సినిమా సీక్వెల్‌ను చేస్తున్నారు. ఈ సినిమాకు తొలుత గబ్బర్ సింగ్ 2 అని పెట్టాలనుకున్నారు. కానీ ఆ పేరు పెడితే సెంటిమెంట్ పరంగా సక్సెస్ కాదని 'సర్దార్' టైటిల్ పెట్టాలనుకున్నారు. ఆ పేరుతో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు. అయితే తాజాగా ఆ పేరు కూడా వద్దనుకుంటున్నారట. 
 
సర్దార్ అనే టైటిల్ ఒక వర్గానికి చెందినదిగా ఉండడంతో సమస్యలు తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని సినీ యూనిట్ భావిస్తున్నారట. ఇప్పుడు ఈ సినిమాకు 'సర్కార్' టైటిల్‌ను ఖరారు చేయనున్నట్టు సమాచారం. అందుకు తోడు బాలీవుడ్‌లో బిగ్ బి అమితాబచ్చన్ ఆ మధ్య తీసిన 'సర్కార్' సినిమా ఎంతటి విజయాన్ని తెచ్చిపెట్టిందో తెలిసిన విషయం. ఇప్పుడు టాలీవుడ్‌లో పవన్ కల్యాణ్ 'సర్కార్' ఆ స్థాయిలో ఘన విజయం సాధిస్తుందని, అందుకే ఆ పేరు వైపే ఎక్కువగా మంది మొగ్గుచూపుతున్నారని సినీ వర్గాల టాక్.

Share this Story:

Follow Webdunia telugu