Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వంగవీటిదే వర్మ చివరి తెలుగు సినిమానా? బర్నింగ్ స్టార్ సంపూ కౌంటర్ నిజమేనా?

వంగవీటిదే వర్మ చివరి తెలుగు సినిమానా? బర్నింగ్ స్టార్ సంపూ కౌంటర్ నిజమేనా?
, శనివారం, 13 ఫిబ్రవరి 2016 (11:59 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏదో వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తాడు. ప్రస్తుతం బెజవాడ రౌడీయిజం అంటూ వంగవీటి సినిమాను తీస్తున్న వర్మ.. దాని పబ్లిసిటీ కోసం ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు. తాజాగా ఇది తెలుగులో తన చివరి సినిమా అని కూడా ప్రకటన చేశాడు. అయితే వర్మ చెప్పిన ఈ లాస్ట్ ఫిలిం అన్న మాటకు టాలీవుడ్‌లో కొందరు నవ్వుకున్నారు మరికొందరు పట్టించుకోవడం మానేశారు. కానీ ఎవరూ రిటార్ట్ ఇవ్వలేదు.
 
అయితే బర్నింగ్ స్టార్ సంపూ మాత్రం వర్మపై చివరి తెలుగు సినిమాపై స్పందించాడు. అంతేకాదు.. వర్మకి వ్యతిరేకంగా ట్వీట్ చేశాడు. అప్పట్లో నాగార్జునతో గోవిందా గోవింద సినిమా తీసినపుడు కూడా వర్మ ఇలాగే శపథాలు చేశాడని గుర్తు చేశాడు. నిజానికి గోవిందా గోవింద సినిమాకి సెన్సార్ విధించిన కట్స్ రిలీజ్‌ని అడ్డుకోవడం.. వర్మకి బాగా చిరాకు తెప్పించాయి. అందుకే చాలా రోజులు తెలుగు సినిమాలు తీయలేదు. తర్వాత అనగనగా ఒక రోజుతో మళ్లీ టాలీవుడ్‌లో సినిమాలు మొదలుపెట్టాడు.
 
మరి బర్నింగ్ స్టార్ వర్మపై నిజంగానే కౌంటర్ వేశాడా? లేకుంటే గతంలో తరహా రాజ్ తరుణ్ అకౌంట్ నుంచి తనపై తానే కామెంట్స్ వేసుకున్న వర్మ.. ఈ బర్నింగ్ స్టార్ అకౌంట్లోకి వెళ్లి తనపై తానే కౌంటర్‌ ఇచ్చుకున్నాడా అనేది తేలాల్సి వుంది.

Share this Story:

Follow Webdunia telugu