Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అలా జరిగితే సమంత తట్టుకోలేదట: ఏ మాయ చేసావె హిట్‌తో...?

అలా జరిగితే సమంత తట్టుకోలేదట: ఏ మాయ చేసావె హిట్‌తో...?
, మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (11:27 IST)
తమిళనాట నుంచి తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అగ్ర హీరోయిన్‌గా ఎదిగిన సమంత ఒక సినిమా ఫ్లాప్ అయ్యిందంటే మాత్రం తట్టుకోలేదట. ఎన్నో ఆశలు పెట్టుకుని నటించిన సినిమా సక్సెస్ కాకపోతే.. హీరోయిన్లు కాస్త అప్సెట్ అవుతుంటారు. కొంతమంది హీరోహీరోయిన్స్ ఈ విషయాన్ని లైట్ తీసుకుంటూ .. మరింత జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకుంటారు. అయితే సమంత మాత్రం సినిమా ఫట్ అయితే కాస్త టెన్షన్ పడతానని చెప్పింది. ఇక తాను ఆశించిన ఫలితం దక్కకపోతే, బాధపడే స్థాయి కూడా ఎక్కువగానే ఉంటుందని అంటోంది.
 
కానీ తాను తొలిసారిగా నటించిన తమిళ చిత్రం పరాజయాన్ని చవిచూసిందనీ, అయినా అప్పుడు తాను పెద్దగా బాధపడలేదని,. సరిగ్గా ఆ సమయంలోనే తెలుగులో 'ఏ మాయ చేశావే' సూపర్ హిట్ అయిందనీ, ఆ సంతోషంతో .. తమిళ సినిమా పరాజయం సంగతి మరిచిపోయానని చెప్పుకొచ్చింది. సమంత ఇలా మాట్లాడటం చూసి సినీ జనమంతా ఆమె చాలా సెన్సిటివ్ అని మాట్లాడుకుంటున్నారట.

Share this Story:

Follow Webdunia telugu