రాజ్ నిడిమోరును సమంత రూత్ ప్రభు రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. సమంత తన పెళ్లి వేడుకకు సంబంధించి సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేసింది. ఆమె ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఐతే మరికొందరు మాత్రం ఎప్పటిలాగే ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామికి విపరీతంగా ఫోన్లు చేస్తున్నారట. రాజ్ నిడిమోరును సమంత పెళ్లి చేసుకున్నది కదా వాళ్ల జాతకం ఎలా వుంది అని అడుగుతున్నారట. శుక్ర మౌఢ్యమిలో పెళ్లి చేసుకున్న సమంత-రాజ్ వైవాహిక జీవితం ఎలా వుంటుందంటూ ఆయనను అడుగుతున్నారట. దీనిపై వేణుస్వామి స్పందిస్తూ.. ప్రస్తుతం తను ఓ పెద్ద సినిమా సక్సెస్ కావాలని యాగం చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమయంలో సమంత-రాజ్ నిడిమోరు జాతకాలు గురించి చెప్పే తీరిక లేదని అందరికీ చెప్పేసాడట.
బాధితురాలిగా విలన్ భలే యాక్ట్ చేసింది
ఇదిలావుంటే సమంత మాజీ మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆమె చేసిన పోస్ట్ సారాంశం ఏమిటంటే... విలన్ బాధితురాలిగా చాలా బాగా పోషించింది అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని పోస్ట్ చేసింది. చాలామంది నెటిజన్లు ఈ సందేశం సమంతను లక్ష్యంగా చేసుకుని పెట్టిందంటూ సాధనాపై ఆన్‌లైన్‌లో ట్రోల్ చేయడం ప్రారంభించారు. దీనికి ప్రతిస్పందనగా, సాధనా తనకు వచ్చిన ట్రోల్ సందేశాల స్క్రీన్‌షాట్‌లను షేర్ చేసి, వీరు స్తంభించిన మెదడులతో వున్న చదువుకున్న నిరాశ చెందిన మానవులు. నన్ను వెంటాడి దుర్వినియోగం చేస్తున్నారు అని రాశారు. ఆ తర్వాత ఆమె కొందరు తనపై తప్పుడు అంచనాలను వ్యాప్తి చేస్తున్నారని, సమంత గురించి తాను ఎప్పుడూ ఏమీ ధృవీకరించలేదని చెబుతూ మరొక స్టోరీని పోస్ట్ చేసింది.
ఐతే తన పోస్ట్ వెనుక ఉన్న నిజమైన అర్థాన్ని వివరించలేదు. మరోవైపు పూనమ్ కౌర్ సైతం తన ఇంట్లో దీపం వెలిగించుకోవడానికి మరొక ఇంట్లో దీపాన్ని ఆర్పేయాలా అంటూ కామెంట్ పెట్టింది. దీనిపైన కూడా చర్చ జరుగుతోంది.