Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హిట్ అండ్ రన్ కేసు.. సల్మాన్‌కు సుప్రీంకోర్టులో మరోసారి ఊరట...

హిట్ అండ్ రన్ కేసు.. సల్మాన్‌కు సుప్రీంకోర్టులో మరోసారి ఊరట...
, సోమవారం, 31 ఆగస్టు 2015 (12:29 IST)
బాలివుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు హిట్ అండ్ రన్ కేసులో మరోసారి ఊరట లభించింది. హిట్ అండ్ రన్ కేసులో గతంలో కింది కోర్టు శిక్ష విధించిన నేపథ్యంలో సల్మాన్‌కు ముంబై హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. ఈ బెయిలును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. 
 
విధులను ఉల్లంఘించి దురుసుగా కారు నడిపి కొందరి మరణానికి కారణమైన కేసులో గత మే నెల ఎనిమిదో తేదిన ముంబై సెషన్స్ కోర్టు సల్మాన్ ఖాన్‌ను దోషిగా ప్రకటించి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే సల్మాన్ అరెస్ట్ అయిన కొద్ది రోజులకే అదే కేసులో ముంబై హైకోర్టు సల్మాన్‌కు బెయిలు మంజూరు చేసింది. అయితే ఆ బెయిలు పై దాఖలైన పిటిషన్‌ను సోమవారం సుప్రీం కోర్టు కొట్టివేసి సల్మాన్‌కు మరోసారి ఊరటను కల్పించింది.

Share this Story:

Follow Webdunia telugu