Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

షాహిద్ హుందాగా ఉంటాడు.. డేటింగ్ చేస్తే నాకేంటి.. విబేధాల్లేవ్!: సైఫ్

షాహిద్ హుందాగా ఉంటాడు.. డేటింగ్ చేస్తే నాకేంటి.. విబేధాల్లేవ్!: సైఫ్
, మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (18:16 IST)
షాహిద్ కపూర్ ఇటీవలే ఢిల్లీ గర్ల్ మీరా రాజ్‌పుత్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుకకు సైఫ్ దంపతులు రాకపోవడంతో.. షాహిద్ ప్రేయసి ప్లస్ సైఫ్ అలీఖాన్ సతీమణి కరీనా కపూర్‌ ఎంతో ఫీల్ చేసిందని వార్తలొచ్చాయి. అంతేగాకుండా సైఫ్ అలీ ఖాన్‌కు షాహిద్ కపూర్‌తో విభేదాలంటూ జోరుగా ప్రచారం సాగింది. దీనిపై సైఫ్ అలీ ఖాన్ స్పందిస్తూ.. షాహిద్ కపూర్‌తో తనకు ఎందుకు విబేధాలుండాలని ఎదురు ప్రశ్న వేశాడు. అలా విభేదాలుంటే తామిద్దరం ఎందుకు కలిసి పనిచేస్తామని అడిగాడు. 
 
షాహిద్ జడ్జ్‌గా వ్యవహరిస్తున్న 'ఝలక్ దిఖలాజ సీజన్ 8'లో 'ఫాంటమ్' సినిమా ప్రమోషన్‌లో సైఫ్ పైవిధంగా స్పందించాడు. కాగా 'జబ్ వి మెట్' సినిమా సందర్భంగా కరీనా కపూర్, షాహిద్ కపూర్ కొంత కాలం డేటింగ్ చేశారని వార్తలొచ్చాయి. ఇద్దరూ పెళ్లి పీటలు ఎక్కుతారనగా బ్రేకప్ అయ్యింది. 
 
ఇటీవలే మీరా రాజ్ పుత్‌తో షాహిద్ పెళ్లి జరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఎప్పుడో కరీనాతో షాహిద్ డేటింగ్ చేస్తే...తానెందుకు శత్రువుగా భావించాలని సైఫ్ ఎదురుప్రశ్న వేసి షాకిచ్చాడు. షాహిద్ ఎప్పుడూ హుందాగా ఉంటాడని సైఫ్ పేర్కొన్నాడు. అందరూ అనుకుంటున్నట్టుగా తమ మధ్య విబేధాలు లేవని సైఫ్ తెలిపాడు.

Share this Story:

Follow Webdunia telugu