Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సెక్స్ సీనులో నటిస్తే రూ.ఆరు కోట్లిస్తాం... అమెరికా టీవీ జంటకు బంపర్ ఆఫర్!

సెక్స్ సీనులో నటిస్తే రూ.ఆరు కోట్లిస్తాం... అమెరికా టీవీ జంటకు బంపర్ ఆఫర్!
, బుధవారం, 3 ఫిబ్రవరి 2016 (11:54 IST)
అమెరికాకు చెందిన బుల్లితెర పాపులర్ టీవీ జంటకు ఓ మీడియా కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆ జంట రాబ్‌ కర్దేసియాన్‌, బ్లాక్‌ చినా. ఈ జంటకు ఓ మీడియా సంస్థ భారీ ఆఫర్‌ ఇస్తూ ఓ లేఖ రాశాడు. 
 
'మీరిద్దరూ కేవలం కొన్ని నిమిషాలు అలాంటి సీన్‌లో నటిస్తే.. ఒక మిలియన్‌ డాలర్లు (దాదాపు ఆరు కోట్ల రూపాయలు) రెమ్యునరేషన్‌ ఇస్తాన'ని ప్రకటించాడు. 'మీ అభిమాన గణం, పాపులారిటీ చూసి.. ఇలాంటి వెంచర్‌కు మీరే సరైన వ్యక్తులని భావిస్తున్నాం. అలాంటి వీడియోలో నటించడానికి ఒప్పుకుంటే మీకు ఒక మిలియన్‌ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామ'ని ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా, ఈ ఆఫర్‌ గురించి సీరియస్‌గా ఆలోచిస్తున్నారట ఈ సెలబ్రిటీస్‌.
 
వారిద్దరి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌ చూస్తే వారిద్దరూ ఈ ఆఫర్‌ను ఖచ్చితంగా అంగీకరిస్తారని అందరూ భావిస్తున్నారు. ఇంతకుముందు రాబ్‌ కర్దేసియాన్‌ సోదరి కిమ్‌ కర్దేసియాన్‌ కూడా తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌తో అలాంటి టేప్‌లో నటించి భారీగా ఆర్జించింది. ఇప్పుడు రాబ్‌ కూడా సోదరి బాటలోనే వెళ్లడం ఖాయమని హాలీవుడ్‌ మీడియా చెవులు కొరుక్కుంటోంది. 

Share this Story:

Follow Webdunia telugu