Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గౌతమీపుత్ర శాతకర్ణికి తర్వాత "మణికర్ణిక"పై కన్నేసిన క్రిష్.. కంగనా లుక్ అదుర్స్...

'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాకు తర్వాత మరో సినిమాపై దృష్టి పెట్టాడు దర్శకుడు క్రిష్. 'గౌతమీపుత్ర శాతకర్ణి'తో బాలయ్యకు చారిత్రాత్మక విజయాన్ని అందించిన క్రిష్.. బాలీవుడ్‌లో మరో చారిత్రాత్మక నేపథ్యం గల సి

గౌతమీపుత్ర శాతకర్ణికి తర్వాత
, గురువారం, 13 ఏప్రియల్ 2017 (19:25 IST)
'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాకు తర్వాత మరో సినిమాపై దృష్టి పెట్టాడు దర్శకుడు క్రిష్. 'గౌతమీపుత్ర శాతకర్ణి'తో బాలయ్యకు చారిత్రాత్మక విజయాన్ని అందించిన క్రిష్.. బాలీవుడ్‌లో మరో చారిత్రాత్మక నేపథ్యం గల సినిమాను తెరకెక్కించే పనిలో పడ్డాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మణికర్ణికని తీసుకురానున్నారు. తాజాగా, ఈ చిత్రం ఫస్ట్ లుక్ స్కెచ్ ఒకటి బయటకు వచ్చింది. 
 
సినిమాలో కంగనా రనౌత్‌ను ఎంత పవర్ ఫుల్‌గా చూపించబోతున్నారో ఈ స్కెచ్ చూస్తే స్పష్టమవుతోంది. బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ కంగనా రనౌత్‌ని 'మణికర్ణిక'గా చూపించబోతున్నాడు క్రిష్. 'మణికర్ణిక' టైటిల్ వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితగాథని తెరకెక్కించనున్నారు. కాగా రాజమౌళి తండ్రి, బాహుబలి రచయిత విజయేంద్రప్రసాద్ 'మణికర్ణిక' కథ అందించారు. స్కెచ్ లుక్‌తోనే మణికర్ణిక లుక్ అదిరిపోయింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెర్రీ నాకు మంచి ఫ్రెండ్.. శ్రీమంతుడు చూసి చెర్రీ ఒక్కడే అభినందించాడు: మహేష్ బాబు