Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్ కల్యాణ్‌ స్కిన్ చూసి రేణు దేశాయ్ అసూయపడేదట.. అబ్బా.. వాట్ ఏ ఫోటో అదిరింది...

ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై మాజీ భార్య రేణు దేశాయ్‌‌కి ఇంకా ప్రేమ చనిపోయినట్టు లేదు. నా మాజీ భ‌ర్త ఎప్పటికీ జెంటిల్మెనే అంటోంది. ప‌వ‌న్, రేణు విడిపోవ‌డం... రేణుక‌కు ప‌వ‌న్ భారీ మొత్తంలో భ‌ర‌ణం చెల్లించడం అంద‌ర

పవన్ కల్యాణ్‌ స్కిన్ చూసి రేణు దేశాయ్ అసూయపడేదట.. అబ్బా.. వాట్ ఏ ఫోటో అదిరింది...
, బుధవారం, 7 సెప్టెంబరు 2016 (08:04 IST)
ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై మాజీ భార్య రేణు దేశాయ్‌‌కి ఇంకా ప్రేమ చనిపోయినట్టు లేదు. నా మాజీ భ‌ర్త ఎప్పటికీ జెంటిల్మెనే అంటోంది. ప‌వ‌న్, రేణు విడిపోవ‌డం... రేణుక‌కు ప‌వ‌న్ భారీ మొత్తంలో భ‌ర‌ణం చెల్లించడం అంద‌రికీ తెలిసిందే. ఆ భరణంతో రేణు దేశాయ్ పిల్లలను చదివించుకుంటూ సినిమాలు చేసుకుంటూ తన జీవనం గడిపేస్తోంది. అయినా పవన్‌తో టచ్‌లో ఉంది. ఇటీవలే పవన్ అనుమతితో ఆయన ఫోటోలను సామాజిక వెబ్ సైట్లలో పోస్ట్ చేస్తానని ప్రకటించింది. ఇందులోభాగంగా ఇటీవల పవన్ కత్తిలాంటి కళ్లతో కూడిన ఓ ఫోటోను పోస్ట్ చేసింది. తాజాగా మరో ఫోటో ట్విట్టర్లో పవన్ ఫ్యాన్స్‌ను పలకరించింది. 
 
ఇంతకీ విషయం ఏమిటంటే? పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య రేణుదేశాయ్ ట్విట్టర్ వేదికగా పవన్‌పై మరోసారి స్పందించారు. ఆమె తీసిన ఓ పవన్ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో పవన్ తన కనుబొమ్మను పైకెత్తారు. ఫోటోపై స్పందిస్తూ పవన్ చర్మం చూసి తాను అసూయపడేదానినని రేణు దేశాయ్ వెల్లడించారు. 
 
ఈ ఫోటోను తాను ఎడిట్‌చేయలేదని, తానే ఆ ఫోటోను స్వయంగా తీశానని తెలిపింది. పవన్ నిత్యం యోగా చేయడం, మంచి ఆహారం తీసుకోవడం వలనే ఆయన చర్మం అంతప్రకాశవంతంగా ఉందని చెప్పుకొచ్చింది. రేణుదేశాయ్ అన్నట్లు ఆ ఫోటోలో పవన్ స్కిన్ అందంగా ఆకర్షణీయంగా నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోకు లైక్స్, ట్వీట్స్ వెల్లువల్లా వస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెప్టెంబర్‌ 18న నిఖిల్‌ కుమార్‌ 'జాగ్వార్‌' ఆడియో