Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

''రాణి గారి బంగళా''లో రేష్మి: గుంటూర్ టాకీస్‌‌తో మరో ఛాన్స్!

''రాణి గారి బంగళా''లో రేష్మి: గుంటూర్ టాకీస్‌‌తో మరో ఛాన్స్!
, మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (12:06 IST)
బుల్లితెరపై హాట్ బ్యూటీ రేష్మి తన యాంకరింగ్‌తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ భామ వెండితెరపై తన అందాలను ఒలకపోసేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం ఈ భామ గుంటూరు టాకీస్ అనే చిత్రంలో నటిస్తుండగా, మరో సినిమాలోనూ సంతకం చేసింది. ఆనంద్ నందా, రేష్మి, శివకృష్ణ ప్రధాన పాత్రలో వి.సినీ స్టూడియో నిర్మాణంలో డి. దివాకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ''రాణి గారి బంగళా''. 
 
ఈ సినిమా లోగో లాంచ్ హైదరాబాదులోని ఫిలిమ్ ఛాంబర్లో జరిగింది. ఇక నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం మార్చి నెలాఖరున విడుదల కానుందని దర్శకుడు తెలిపారు. ఈ సినిమాతో రేష్మి స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతుందని.. ఆనంద్‌కి ఇది తొలి సినిమా అయినా చక్కగా నటించాడని దర్శకుడు దివాకర్ వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu