Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీ అచ్యుత ఆర్ట్స్ 'తను... వచ్చేనంట'... హీరోయిన్ రేష్మి గౌతం

శ్రీ అచ్యుత ఆర్ట్స్ 'తను... వచ్చేనంట'... హీరోయిన్ రేష్మి గౌతం
, గురువారం, 23 జూన్ 2016 (16:51 IST)
తేజ కాకుమాను (బాహుబలి ఫేం), రేష్మి గౌతం, ధన్య బాలకృష్ణన్ నటీనటులుగా రూపొందుతున్న చిత్రం “తను... వచ్చేనంట”. ఈ చిత్రానికి వెంకట్ కాచర్ల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ అచ్యుత ఆర్ట్స్ పతాకంపై చంద్రశేఖర్ ఆజాద్ నిర్మిస్తున్నారు. టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను, మోషన్ పోస్టర్‌ని చూసి చాలామంది మెచ్చుకున్నారు. ఈ చిత్ర రచయిత, నిర్మాత చంద్రశేఖర్ ఆజాద్ పాటిబండ్ల మాట్లాడుతూ “ప్రస్తుతం లవ్ స్టొరీలతో పాటు హారర్, కామెడీ సినిమాల హవా ఎక్కువగా నడుస్తుంది. 
 
అలాగే మన ప్రేక్షకులు సెంటిమెంట్ కథల్ని కూడా బాగా ఆస్వాదిస్తారు. జాంబి + కామెడీ = జమేడి జోనేర్ సినిమా అంటే ఏంటో మా సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాం. కథ, కథనం కొత్తగా ఉంటాయి. ఈ సినిమాలో విజయ్ అద్భుతమైన విజువల్ గ్రాఫిక్స్ అందించారు. రేష్మి పాత్ర సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. ఇటివల చేసిన షేడ్యూల్‌తో టాకీ పార్ట్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉంది. ఇంకా 3 పాటలు త్రీకరించాల్సివుంది. 
 
త్వరలో ఈ పాటల్ని కూడా అందమైన లోకేషన్స్‌లో ఈ నెల చివరి వారంలో తెరకెక్కిస్తాం. జూలై మూడో వారంలో ఆడియో రిలీజ్ ప్రోగ్రామ్ గ్రాండ్‌గా చేద్దామని సన్నాహాలు చేస్తున్నాం. చంటి, శివన్నారాయణ, ఫిష్ వెంకట్, పాత్రలే ఆద్యంతం వినోదాన్ని పంచుతాయి. ది బెస్ట్ అవుట్‌పుట్ కోసం దర్శకుడు వెంకట్ కాచర్ల అనుక్షణం కష్టపడుతున్నారు. అరిస్టుల సహకారం చాలాబావుంది. మా బ్యానర్‌కు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది” అని తెలిపారు. 
 
హీరో తేజ కాకుమాను మాట్లాడుతూ “ఈ సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ సినిమా నా కెరీర్లో అద్భుతమైన సినిమా అవుతుంది. ఈ సినిమాతోపాటు మరో 3 సినిమాలు చేస్తున్నాను. అందులో ఈ సినిమా ముందుగా రిలీజ్ అవుతుంది” అన్నారు. ఈ చిత్రానికి ఆన్ లైన్ ప్రొడ్యూసర్ : బెక్కం రవీందర్, ఆర్ట్ డైరెక్టర్ : సిస్తల శర్మ, ఛాయాగ్రహణం : రాజ్ కుమార్, ఎడిటింగ్ టీం : గ్యారీ బీహెచ్, గణేష్.డి, విజువల్ ఎఫెక్ట్స్ : విజయ్, సంగీతం : రవిచంద్ర, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : శశి ప్రీతం, సహ నిర్మాత : పి. యశ్వంత్, కథ, నిర్మాత : చంద్రశేఖర్ ఆజాద్ పాటిబండ్ల, క్రియేటివ్ ప్రొడ్యూసర్ : కె. రాఘవేంద్ర రెడ్డి, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : వెంకట్ కాచర్ల. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూలై 1న వస్తున్న సూపర్ స్టార్ సూర్య "మేము"