Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సంజయ్ దత్‌ బయోపిక్‌లో రణ్‌బీర్.. ఫోటోలు లీక్.. అచ్చం మున్నాభాయ్‌లా?

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ బయోపిక్ రూపుదిద్దుకునేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ సంజయ్ దత్ పాత్రలో నటిస

సంజయ్ దత్‌ బయోపిక్‌లో రణ్‌బీర్.. ఫోటోలు లీక్.. అచ్చం మున్నాభాయ్‌లా?
, గురువారం, 13 ఏప్రియల్ 2017 (16:31 IST)
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ బయోపిక్ రూపుదిద్దుకునేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ సంజయ్ దత్ పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా విడుదలైన ఫోటోల్లో రణబీర్ కపూర్ సంజయ్ దత్ కు జిరాక్స్ కాపీలా ఉండటం చూసి అంతా షాక్ అవుతున్నారు. 
 
సంజయ్ దత్ జీవితంలో పలు వివాదాలున్నాయి. పలు కేసుల్లో ఇరుక్కుని ఏళ్ల తరబడి జైలు జీవితం కూడా అనుభవించాడు సంజయ్. ఇక పలువురు హీరోయిన్లతో సంజయ్ దత్ ఎఫైర్ల గురించి ఓ పుస్తకమే రాయొచ్చు. అలాంటి సంజయ్ దత్ జీవితంలో జరిగిన సంఘటనలకు కారణాలేంటి? అనే అంశంపై ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఇంకా ఈ సినిమాకు టైటిల్ ఖరారు కాలేదు. 
 
సంజయ్ దత్ పుట్టుక దగ్గర నుండి, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో స్నేహం, అతడి వల్ల అక్రమ ఆయుధాల కేసులో ఇరుక్కోవడం...హీరోయిన్లతో ఎఫైర్లు ఇలా సంజయ్ దత్ జీవితంలోని అన్ని వివాదాలు ఈ సినిమాలో చూపించబోతున్నట్లు సమాచారం. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆఫర్ల కోసం పడక గదుల్లోకి దూరే టైపు నాది కాదు.. ఆ డైరక్టర్ మోసం చేశాడు : ఇలియానా