Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రణభీర్ బ్రీఫ్స్ వాడడు.. బాక్సర్సే వాడుతాడు: దీపికా పదుకునే

రణభీర్ బ్రీఫ్స్ వాడడు.. బాక్సర్సే వాడుతాడు: దీపికా పదుకునే
, బుధవారం, 25 నవంబరు 2015 (19:40 IST)
రణభీర్ కపూర్, దీపిక జంటగా నటించిన తమాషా చిత్రం మరో రెండు రోజుల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న దీపికా. రణభీర్ అండ్ టీమ్ సినిమాకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బ్రీఫ్స్ లేదా బాక్సర్స్ వీటిలో మీరు వేటిని ప్రిఫర్ చేస్తారని రణభీర్‌కు ఓ ప్రశ్న ఎదురుకాగా.. ఇందుకు రణబీర్ వెంటనే బ్రీఫ్స్ అని సమాధానమిచ్చాడు.
 
అయితే ప్రక్కనే ఉన్న దీపిక వెంటనే స్పందిస్తూ అతను అబద్దం చెబుతున్నాడు. రణభీర్ బాక్సర్లు వాడతాడని బదులిచ్చింది. అలాగే కత్రీనాతో రణ్‌బీర్ కపూర్ పెళ్లి తన పర్మిషన్ లేకుండా జరగదని చెప్పింది. అయితే రణ్ బీర్ పెళ్లికి తాను ఒప్పేసుకున్నానని దీపిక కామెంట్స్ చేసింది.

దీపిక కామెంట్స్‌తో షాక్ అయిన అక్కడి వారంతా గతంలో తమాషా హీరోహీరోయిన్స్ ప్రేమికులే కదా అంటూ లైట్‌గా తీసుకున్నారు. కాగా..బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న దీపికా పదుకునే తమాషా సినిమా నవంబర్ 27న విడుదల కాగా బాజీరావ్ మస్తానీ చిత్రం డిసెంబర్ 18న విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu