Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తాప్సీకి రానా పొగడ్తలు... అదరగొట్టావంటూ కితాబు

నటి తాప్సీని దగ్గుబాటి రానా పొడగ్తల్తో ముంచెత్తాడు. ఆమె నటించిన బాలీవుడ్‌ మూవీ 'పింక్‌'. ఇందులో ఆమె నటనకు ముగ్థుడై.. బాలీవుడ్‌లో మంచి పేరు సంపాదిస్తున్నావని పేర్కొన్నాడు. అటు టాలీవుడ్‌, ఇటు బాలీవుడ్‌లో నటించే తాప్సీ.. తాజాగా చేసిన సినిమా ఇది. ఈ చిత్

తాప్సీకి రానా పొగడ్తలు... అదరగొట్టావంటూ కితాబు
, శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (21:33 IST)
నటి  తాప్సీని దగ్గుబాటి రానా పొడగ్తల్తో ముంచెత్తాడు. ఆమె నటించిన బాలీవుడ్‌ మూవీ 'పింక్‌'. ఇందులో ఆమె నటనకు ముగ్థుడై.. బాలీవుడ్‌లో మంచి పేరు సంపాదిస్తున్నావని పేర్కొన్నాడు. అటు టాలీవుడ్‌, ఇటు బాలీవుడ్‌లో నటించే తాప్సీ.. తాజాగా చేసిన సినిమా ఇది. ఈ చిత్రం శుక్రవారం నాడు హైదరాబాద్‌లో కొందరు సినీ ప్రముఖులకు ప్రివ్యూ ఏర్పాటు చేశారు. 
 
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రానా పైవిధంగా స్పందించాడు. ఆయనతోపాటు సుశాంత్‌, అల్లు శిరీష్‌, రాశీ ఖన్నా కూడా పాల్గొన్నారు. అమితాబ్‌తో నటించిన సన్నివేశాల్లో తాప్సీ చూపించిన అభినయం అద్భుతంగా వుందని వారంతా ప్రశంసించారు. తెలుగులో కాస్త గ్యాప్‌ ఇచ్చిన తాప్సీ.. నెంబర్స్‌ స్థానంలో నేను లేను కాబట్టి.. నాకు పెద్దగా అవకాశం రావడంలేదని ఇటీవలే స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. మరి ఈ చిత్రం తర్వాత ఎలాంటి ఆఫర్లు వస్తాయో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'జనతా గ్యారేజ్' రూ.100 కోట్లకు పరుగు... ఎన్టీఆర్ దాహం తీరుతోంది...