Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రుద్రమదేవికి రానా సెంటిమెంట్: గుణశేఖర్‌కు భయం భయం..!

రుద్రమదేవికి రానా సెంటిమెంట్: గుణశేఖర్‌కు భయం భయం..!
, గురువారం, 8 అక్టోబరు 2015 (11:41 IST)
రుద్రమదేవి రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఎన్నో అడ్డంకులను అధిగమించి శుక్రవారం రిలీజ్ కానున్న రుద్రమదేవికి రానా సెంటిమెంట్ కాస్త భయపెడుతోంది. రుద్రమదేవి సినిమాను ఆన్ లైన్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న నేపథ్యంలో గుణశేఖర్‌కు భయం పట్టుకుంది. సాధారణంగా రానాకు తన బాబాయ్ వెంకీతో చేసిన హీరోయిన్లతో రొమాన్స్ చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయనే సెంటిమెంట్ ఉందట.
 
గతంలో వెంకీతో సుభాష్ చంద్రబోస్‌లో నటించిన జెనీలియాతో రానా నా ఇష్టం అని సినిమాలో నటించాడు. అదీ ఫ్లాప్ అయ్యింది. అలాగే వెంకీతో లక్ష్మీ, తులసీ వంటి సినిమాల్లో నటించిన నయనతారతో ‘కృష్ణం వందే జగద్గురుం’లో రానా నటిస్తే అది కూడ కలిసి రాలేదు. తాజాగా వెంకటేష్‌తో చింతకాయల రవి సినిమాలో రొమాన్స్ చేసిన అనుష్కతో రానా రుద్రమదేవిలో రొమాన్స్ చేస్తున్నాడు. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. 
 
దీనితో ఈ సెంటిమెంట్ ప్రభావం ‘రుద్రమదేవి’ విజయంపై ఉంటుందా అని గుణశేఖర్ భయపడిపోతున్నాడు. అయితే రానా అనుష్కతో కలిసి ‘బాహుబలి’లో నటించినా ఆ సినిమా హిట్ కావడం కొంత ఊరటనిచ్చినా.. ఆ మూవీలో రానాది నెగిటివ్ క్యారెక్టర్ కావడంతో బతికిపోయిందని.. మరి రుద్రమదేవిని రానా సెంటిమెంట్ ఏం చేస్తుందోనని గుణశేఖర్ భయపడిపోతున్నారు. మరి ఈ సెంటిమెంట్స్‌కు సమాధానం దొరకాలంటే శుక్రవారం వరకు ఆగాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu