Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మ్యూజిక్‌ సిట్టింగ్‌లో రామ్‌: సంగీత దర్శకుడిగా గిబ్రాన్‌.. రెగ్యులర్ షూటింగ్ త్వరలో!

మ్యూజిక్‌ సిట్టింగ్‌లో రామ్‌: సంగీత దర్శకుడిగా గిబ్రాన్‌.. రెగ్యులర్ షూటింగ్ త్వరలో!
, గురువారం, 28 ఏప్రియల్ 2016 (10:35 IST)
రామ్‌ కథానాయకుడిగా సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇప్పటికే ఈ చిత్రం స్క్రిప్ట్‌ పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్‌ సిటింగ్స్‌ జరుగుతున్నాయి. సంగీత దర్శకుడు గిబ్రాన్‌తో కలిసి రామ్‌.. సంతోష్‌ శ్రీనివాస్‌ మ్యూజిక్‌ సిటింగ్స్‌లో పాల్గొంటున్నారు. తనకి ఇష్టమైన హీరోల్లో రామ్‌ ఒకరనీ .. ఆయన సినిమాకి పనిచేయడం ఆనందంగా వుందని గిబ్రాన్‌ అన్నాడు. 
 
గతంలో రామ్‌, సంతోష్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్లో వచ్చిన 'కందిరీగ' బాక్సాఫీస్‌ దగ్గర భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా కూడా ఆ రేంజ్‌ హిట్‌ కొడుతుందేమోననేది ఆసక్తికరంగా మారింది. ఈ మధ్య 'శివం', 'నేను శైలజ' సినిమాల తర్వాత గ్యాప్‌ తీసుకుని రామ్‌ చేస్తున్న చిత్రమిది. త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ జరగనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కమల్‌ హాసన్, శ్రుతిహాసన్‌ సినిమాలో బ్రహ్మానందం!