Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రామ్ గోపాల్ వర్మకు పాలిటిక్స్‌పై ప్రేమ పుట్టిందట.. అంగూర్ లత అందాలే..?!

రామ్ గోపాల్ వర్మకు పాలిటిక్స్‌పై ప్రేమ పుట్టిందట.. అంగూర్ లత అందాలే..?!
, మంగళవారం, 24 మే 2016 (11:04 IST)
పాలిటిక్స్‌పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ప్రేమ పుట్టిందంటే నమ్ముతారా? అందుకు కారణం ఎవరో కాదు.. అంగూర్ లత అనే అందమైన ఓ యంగ్ ఎమ్మెల్యేనే కారణమట. పాలిటిక్స్ అంటే అర్థం కావు అంటూ సింపుల్‌గా చెప్పేసే వర్మ తొలిసారి తనకు పాలిటిక్స్‌పై ప్రేమ పుట్టిందంటున్నాడు. అంతేకాదు.. ఇందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు కూడా చెప్పాడు. అయితే వర్మ పాలిటిక్స్‌లోకి కాలు పెట్టడు. ఏ పార్టీలోకి చేరడు. కానీ అంగూర్ లత అనే అస్సామీ యాక్టర్ పాలిటిక్స్‌లో ఉండటంతో తనకు పాలిటిక్స్ అంటే ప్రేమ పుట్టిందని చెప్పుకొచ్చాడు. 
 
అంగూర్ లతకు పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అంతేగాకుండా మొన్న జరిగిన అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె బీజేపీ తరపున పోటీ చేసి విజయం సాధించింది. ఆమె అందాన్ని చూసిన వర్మ ఒక్కసారిగా పాలిటిక్స్ పై ప్రేమ పెంచుకొన్నాడు. అంగూర్ లత టైట్ డ్రెస్సులో ఉన్న కొన్ని ఫొటోల్ని పోస్ట్ చేస్తూ `ఒక ఎమ్మెల్యే ఇలా కనిపించిందంటే మంచి రోజులు వచ్చినట్టే అర్థం` అని కామెంట్ పెట్టాడు. తొలిసారి తనకూ పాలిటిక్స్‌పై ప్రేమ పుట్టిందంటూ కామెంట్స్ చేశాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శరవేగంగా బాహుబలి 2 షూటింగ్: 2017 ఏప్రిల్‌లో రిలీజ్.. క్లైమాక్సే పెండింగ్!