Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రామ్ గోపాల్ వర్మ ఆన్‌లైన్ థియేటర్: సింగిల్ X షార్ట్ ఫిలిమ్ బూతు ఫోటో రిలీజ్!

రామ్ గోపాల్ వర్మ ఆన్‌లైన్ థియేటర్: సింగిల్ X షార్ట్ ఫిలిమ్ బూతు ఫోటో రిలీజ్!
, మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (12:39 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా మంచిపేరు తెచ్చుకున్నాడు. తాజాగా కిల్లింగ్ వీరప్పన్‌తో మంచి సక్సెస్ సాధించిన వర్మకు హాట్ అండ్ ఎరోటిక్ కాన్సెప్ట్ సినిమాలను తెరకెక్కించడంలో దిట్టన్న విషయం అందరికీ తెలిసిందే. వర్మ తాజా సినిమాకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్లో హల్ చల్ చేస్తోంది. ఈ మేరకు వర్మ ఓ బూతు బొమ్మతో పాటు ఓ పోస్ట్ తన ట్విట్టర్ ఖాతాలో పెట్టి సంచలనం సృష్టించాడు. 
 
త్వరలోనే తాను ఆర్జీవీ టాకిస్ అనే ఆన్‌లైన్ థియేటర్ని యూట్యూబ్‌లో లాంచ్ చేస్తున్నానని వర్మ తెలిపాడు. ఇందులో భాగంగా తాను తీసిన మొదటి షార్ట్ ఫిల్మ్‌కి సంబంధించిన బూతు పోస్టర్ని రిలీజ్ చేశాడు. సింగిల్ Xకి సంబంధించిన పోస్టర్ని రిలీజ్ చేశానని చెప్పుకొచ్చాడు. తన ఆలోచనలను సెన్సార్ వాళ్ల కోసం ఆపలేనని.. అందుకే ఆన్‌లైన్ థియటేర్ మొదలెట్టానని చెప్పాడు. ఇందులో తాను తీసే సినిమాలే కాకుండా.. నా టేస్ట్‌కి దగ్గరగా ఉండే సినిమాలు ఎవరు చేసినా రిలీజ్ చేస్తానని చెప్పుకొచ్చాడు.

Share this Story:

Follow Webdunia telugu