Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

''రాయల్ చరణ్'' అంటూ చెర్రీకి వినాయక్ కొత్త ట్యాగ్: రూ.150 కోట్ల బడ్జెట్‌తో..?

''రాయల్ చరణ్'' అంటూ చెర్రీకి వినాయక్ కొత్త ట్యాగ్: రూ.150 కోట్ల బడ్జెట్‌తో..?
, శనివారం, 3 అక్టోబరు 2015 (15:38 IST)
ప్రముఖ దర్శకుడు వినాయక్ చెర్రీకి కొత్త ట్యాగ్ తగిలించారు. బ్రూస్ లీ ఆడియో వేడుకలో వినాయక్ చరణ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. చరణ్ హుందాగా వ్యవహరిస్తాడని, అతడితో సినిమాలు తీసేవారికి మెగా పవర్ స్టార్‌గా కాకుండా రాయల్ చరణ్‌గా కనిపిస్తాడంటూ కొనియాడుతూనే చెర్రీకి కొత్త ట్యాగ్ ఇచ్చాడు. అంతేకాకుండా ‘చరణ్ బార్న్ విత్ గోల్డెన్ హార్ట్’ అని వినాయక్ ఆకాశానికెత్తేశాడు.
 
చిరంజీవి 150వ సినిమా సంగతుల వివరాలను చెప్పించేందుకు వినాయక్ శాయశక్తులా ప్రయత్నించాడు. అయితే చిరంజీవి మాత్రం తన స్పీచ్‌లో 150వ సినిమాకు సంబంధించిన ప్రస్తావన ఏమాత్రం తీసుకురాలేదు. అయితే తన 150వ సినిమాకు కథ దొరకలేదని చెప్పను కానీ తన 150వ సినిమా గురించి మరో 15 రోజుల లోపు అధికారక ప్రకటన ఉంటుంది అని చెప్పడంతో చిరంజీవి తన 150వ సినిమాపై నెలకొన్న సస్పెన్స్‌కు త్వరలోనే తెరపడనుంది.
 
ఈ కార్యక్రమ యాంకర్ సుమ అల్లుఅరవింద్‌తో.. మీరు చిరంజీవితో ఎప్పుడు సినిమా తీస్తారు అని ప్రశ్నించినప్పుడు చిరంజీవి నటించబోయే 151వ సినిమా తన బ్యానర్‌లోనే ఉంటుంది అని లీక్ ఇవ్వడమే కాకుండా ఈ సినిమాను 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తాను తీస్తాను అంటూ క్లారిటీ ఇచ్చేశారు.

Share this Story:

Follow Webdunia telugu