Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బ్రహ్మోత్సవం : సమంత అవుట్ రకుల్ ప్రీత్ సింగ్ ఇన్..

బ్రహ్మోత్సవం : సమంత అవుట్ రకుల్ ప్రీత్ సింగ్ ఇన్..
, బుధవారం, 26 ఆగస్టు 2015 (10:39 IST)
మహేష్ బాబు బ్రహ్మోత్సవంలో సమంత ఆఫర్ నిల్ అయ్యింది. సమంత స్థానంలో రకుల్ ప్రీత్ సింగ్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.  దర్శకుడు శ్రీకాంత్ సమంతను పక్కనబెట్టేసి రకుల్ ప్రీత్ సింగ్ బెటర్ ఆప్షన్ అంటూ ఆమెను తీసుకున్నట్లు సమాచారం. ఇక అధికార ప్రకటనే తరువాయి. ఈ సినిమాలో ముగ్గురు భామలతో మహేష్ బాబు రొమాన్స్ చేయనున్నాడు.
 
ఇప్పటికే కాజల్ అగర్వాల్ ఫస్ట్ హీరోయిన్‌గా ఎంపిక కాగా, ప్రణీత సుభాష్ రెండో హీరోయిన్‌గా సమంత మూడో హీరోయిన్‌గా ఎంపికయ్యారు. అయితే సమంత స్థానంలో రకుల్ ప్రీత్ సింగ్‌ను దర్శకుడు ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. కాగా సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్న ఈ సినిమా షూటింగ్‌లో మహేష్ సెప్టెంబర్ 14వ తేదీ నుంచి పాల్గొంటాడని సమాచారం. ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యామిలీ ఐలాండ్, థాయ్‌లాండ్‌లో హాలీ డే ట్రిప్‌కు వెళ్లాడు.

Share this Story:

Follow Webdunia telugu