Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కల్యాణ్ రామ్‌ సరసకు చేరేందుకు ఎప్పుడూ సిద్ధమే.. రకుల్ హొయలు

కల్యాణ్ రామ్‌ సరసకు చేరేందుకు ఎప్పుడూ సిద్ధమే.. రకుల్ హొయలు
, గురువారం, 27 ఆగస్టు 2015 (16:55 IST)
టాలీవుడ్‌లో క్రేజీ బ్యూటీగా వెలుగుతున్న చిన్నది రకుల్ ప్రీత్ సింగ్. అమ్మడు ఇప్పుడు ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్‌ల సరసన సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇంత బిజీలో కూడా అవకాశం రావాలే గానీ కల్యాణ్ రామ్ జోడీకట్టడానికీ తాను సిద్ధంగా వున్నానని చెప్పింది. ఆయన నిర్మించిన 'కిక్ 2' సినిమా గురించి ప్రస్తావిస్తూ ఆమె ఈ మాట అంది. 
 
క్రేజీ హీరోయిన్ గా మంచి స్పీడు మీదున్న రకుల్, మొన్ననే 'పండగ చేస్కో' సినిమా ద్వారా యూత్‌ను పలకరించింది. ఆ వెంటనే వచ్చిన 'కిక్ 2' ద్వారా అలరిస్తోంది. ఈ సినిమాలో తాను పోషించిన 'చైత్ర' పాత్ర తనకు ఎంతగానో నచ్చిందని ఇటీవల ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో తెలిపింది. తెరపై ఈ సినిమాలో భారీతనం కనిపించడానికి కారణం కల్యాణ్ రామ్ అనీ, ఆయన సొంత బ్యానర్‌లో నటించడం ఆనందంగా ఉందని చెప్పింది. 
 
అదే సమయంలో ఛాన్స్ చిక్కాలే గానీ, కల్యాణ్ రామ్ సరసన నటించడానికి తాను ఎప్పుడూ సిద్ధమేనని తెలిపింది. కల్యాణ్ రామ్ తరువాత సినిమాలో కథానాయిక ప్లేస్‌లో రకుల్ ఇలా ఖర్చీఫ్ వేసేసిందనే టాక్ వినిపిస్తోంది. మరి ఇది ఎప్పుడు జరుగుతుందో మాత్రం ఇప్పటికి స్పష్టంగా చెప్పలేము.

Share this Story:

Follow Webdunia telugu