Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విడిపోతోంది నిజమే.. మా ఫ్యామిలీ పరువు తీయొద్దు.. ప్లీజ్ : సౌందర్యా రజినీకాంత్

తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ కూతురు సౌందర్య వైవాహిక జీవితం విడాకుల దిశగా సాగుతోందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. పెళ్లి చేసుకున్నఇన్ని రోజుల తర్వాత.. విడిపోతున్నట్లుగా రూమర్లు వచ్చాయి. అయితే ఈ వార్తలప

విడిపోతోంది నిజమే.. మా ఫ్యామిలీ పరువు తీయొద్దు.. ప్లీజ్ : సౌందర్యా రజినీకాంత్
, శనివారం, 17 సెప్టెంబరు 2016 (11:55 IST)
తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ కూతురు సౌందర్య వైవాహిక జీవితం విడాకుల దిశగా సాగుతోందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. పెళ్లి చేసుకున్నఇన్ని రోజుల తర్వాత.. విడిపోతున్నట్లుగా రూమర్లు వచ్చాయి. అయితే ఈ వార్తలపై రజినీ కూతురు సౌందర్య నోరువిప్పింది. మీడియాలో వస్తున్న వార్తలు నిజమే అని తేల్చి చెప్పింది. అశ్విన్ కుమార్ అనే వ్యాపారవేత్తను ఆరేళ్ళ క్రిందట వివాహం చేసుకుని హాయిగా జీవిస్తున్న విషయం తెలిసిందే. అయితే కారణాలు ఏమిటో తెలియదు గానీ, విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టులో సౌందర్య పిటిషన్ దాఖలు చేసినట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. 
 
ఈ విషయంపై స్పందించిన సౌందర్య... గత యేడాది కాలంగా సెపరేట్‌గా ఉంటున్నామని చెప్పింది. అయితే.. ఈ వార్తలను ఇంతటితో ఆపాలని.. మా ఫ్యామిలీ పరువు తీసేలా.. చేయొద్దని వేడుకుంది. మాకు మా ఫ్యామిలీకి ప్రైవసీ ఇవ్వండి అని ట్విట్టర్‌లో తెలిపింది. ప్రస్తుతం ఆమె భర్త అశ్విన్ యూఎస్‌లో ఉన్నాడని, అతను రాగానే ఇద్దరూ ఫ్యామిలీ కోర్టులో విడాకులు పొందనున్నానని తెలిపింది. 
 
వివాహానంతరం సౌందర్య సినిమాలపై దృష్టి సారించింది. రజనీ సినిమాలకు ఆమె పని చేస్తూ వచ్చింది. ''కొచ్చాడయాన్'' కు దర్శకురాలిగా పనిచేసింది. త్వరలోనే మళ్లీ తండ్రిని హీరోగా పెట్టి ఆమె ఒక సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాలున్నాయనే వార్తలున్నాయి. కానీ ఇంతలోనే ఆమె విడాకుల వార్తలు హైలెట్ అవుతుండటం గమనార్హం. రజినీకాంత్ కూడా వాళ్లిద్దరినీ కాంప్రమైజ్ చేయలేకపోయాడట. దీంతో రజినీ కూతురుసౌందర్య విడాకులు తీసుకోవడం ఖాయమైనట్టుగా వార్తలు వస్తున్నాయి. భర్త అశ్విన్ నుంచి సౌందర్య విడిపడటం ఖాయమైనట్టు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంకా ఎన్ని గొర్రెలు మిగులుతాయ్!