శివకార్తికేయన్‌పై రజనీకాంత్ ప్రశంసలు.. యాక్షన్ హీరో అయిపోయావంటూ కితాబు

ఠాగూర్
గురువారం, 11 సెప్టెంబరు 2025 (10:16 IST)
తమిళ హీరో శివకార్తికేయన్‌పై సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల విడుదలైన మదరాసి చిత్రాన్ని చూసిన తర్వాత ఆయన ఈ మేరకు ప్రశంసలు కురిపించారు. ప్రముఖ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో శివకార్తికేయన్‌ నటించిన తాజాగా చిత్రం 'మదరాసి'. ఈ నెల 5వ తేదీన విడుదలై, ఆదరణ సొంతం చేసుకుంటోంది. తాజాగా ఈ సినిమా చూసిన రజనీ చిత్రబృందాన్ని అభినందించారు. ఈ విషయాన్ని తెలుపుతూ శివకార్తికేయన్‌ పోస్ట్ పెట్టారు. తాను దైవంగా భావించే తలైవా నుంచి ప్రశంసలు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. 
 
'సినిమా బాగుంది. నీ నటన మరో స్థాయిలో ఉంది. అద్భుతంగా నటించావు. మదరాసి నాకు చాలా నచ్చింది. నువ్వు యాక్షన్‌ హీరో అయిపోతావు. నా దీవెనలు నీకు ఎప్పుడూ ఉంటాయిట అంటూ తన ట్రేడ్‌మార్క్ చిరునవ్వుతో రజనీకాంత్‌ నన్ను ప్రశంసించారు. నా దైవం నుంచి అభినందనలు అందుకోవడం ఆనందంగా ఉంది' అని శివకార్తికేయన్ తన పోస్టులో రాసుకొచ్చారు. 
 
ఇక ఈ సినిమా విడుదలైన అనంతరం కోలీవుడ్‌ సినీ ప్రముఖులు దీన్ని ప్రశంసిస్తూ ఎక్స్‌ వేదికగా చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. దర్శకుడు శంకర్‌, లింగుస్వామి 'మదరాసి'పై రివ్యూ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ ఐటీ కారిడార్లలో మోనో రైలు.. రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు.. పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు.. 8 గంటలకు ప్రారంభం

ఏబీసీ క్లీన్‌టెక్, యాక్సిస్ ఎనర్జీతో రూ. 1,10,250 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

దీని గురించి మీకు తెలియదు.. దగ్గరికి రాకండి.. భార్యను నడిరోడ్డుపైనే చంపేసిన భర్త (video)

ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతాం : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments