Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాహుబలి రూ.100 కోట్ల రికార్డును సాధిస్తుంది: రాజమౌళి

బాహుబలి రూ.100 కోట్ల రికార్డును సాధిస్తుంది: రాజమౌళి
, బుధవారం, 1 జులై 2015 (14:12 IST)
ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ సినిమా రూ. 100 కోట్ల రికార్డు సాధిస్తుందని దర్శకుడు రాజమౌళి ధీమా వ్యక్తం చేశారు. డబ్బులు మిగుల్చుకోవడానికి ఈ సినిమా చేయలేదని స్పష్టం చేసిన జక్కన్న.. సినిమా రిలీజ్‌కు సమయం దగ్గరపడతున్న కొద్దీ టెన్షన్ పెరిగిపోతుందని.. ఒత్తిడిని కవర్ చేసుకోవడానికి బలవంతంగా నవ్వాల్సి వస్తోందని ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి వ్యాఖ్యానించారు.  
 
బాహుబలి సినిమాలో స్టోరీ అంతా బాహుబలి రోల్ చుట్టూనే తిరుగుతుందని.. సినిమాలోని పాత్రలకు బాహుబలి పాత్రతోనే సంబంధం ఉంటుందని రాజమౌళి వెల్లడించారు. బాహుబలి రోల్‌కు ప్రభాస్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేదన్నారు. చిత్ర సమర్పకుడు రాఘవేంద్రరావు తమపై బరువు మోపారని, ఈ మూవీకి సంబంధించి ఆయన ఒక్క ఫ్రేమును కూడా చూడలేదని... దాంతో ఒత్తిడి పెరిగిందని రాజమౌళి తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu