Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజమౌళికి పుష్కరాల సెంటిమెంట్ : నాడు సింహాద్రి-నేడు బాహుబలి.. హిట్టేనా..?

రాజమౌళికి పుష్కరాల సెంటిమెంట్ : నాడు సింహాద్రి-నేడు బాహుబలి.. హిట్టేనా..?
, శుక్రవారం, 3 జులై 2015 (13:10 IST)
బాహుబలి ఫస్ట్ పార్ట్ ఈ నెల పదో తేదీన రిలీజ్ కానుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్‌‌ మూవీగా రూపుదిద్దుకుని.. భారీ కలెక్షన్ల కోసం రెడీగా ఉన్న ఈ సినిమాకు, దర్శకుడు రాజమౌళికి పుష్కరాల సెంటిమెంట్ కలిసొచ్చింది. సరిగ్గా 12 సంవత్సరాల క్రితం రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమా విడుదలై బంపర్ హిట్ కావడంతో పాటు భారీ కలెక్షన్స్ సాధించింది. 
 
అప్పట్లో పుష్కరాలు జరుగుతున్న కాలం రాజమండ్రిలోని అన్నీ థియేటర్లలో ఈ సినిమాను 20 రోజుల పాటు ప్రదర్శించారు. దర్శకుడు ఇదే సెంటిమెంట్‌ను బాహుబలికి కూడా ఆపాదించారు. పుష్కరాల సమయానికి అన్నీ థియేటర్లలో బాహుబలిని రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమైందని జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
సింహాద్రి సినిమాలో పుష్కర సన్నివేశాన్ని కొవ్వూరు గోపాదాల రేవులో చిత్రీకరించారు. పుష్కరాలను తలపించే విధంగా ఈ చిత్రం సహజంగా చిత్రీకరించబడింది. ఈ చిత్రం హిట్ కావడంతోనే రాజమౌళికి మంచి పేరొచ్చింది. ప్రస్తుతం బాహుబలి చిత్రం కూడా పుష్కరాలు మొదలయ్యే 14 రోజుల నుంచి ముగిసే వరకు రాజమండ్రిలోని అన్ని థియేటర్లలో ప్రదర్శించే ఛాన్సుందని చెబుతున్నారు. అందుకే ఈ సినిమా కూడా తప్పకుండా హిట్ అవుతుందని సినీ పండితులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu