Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మళ్ళీ 'ఫైర్'... లెస్బియన్‌గా రాధికా కొత్త మూవీకి సైన్?

మళ్ళీ 'ఫైర్'... లెస్బియన్‌గా రాధికా కొత్త మూవీకి సైన్?
, సోమవారం, 31 ఆగస్టు 2015 (11:05 IST)
వెండితెరపై వివాదాస్పద పాత్రల్లో నటిస్తూ, విచ్చలవిడిగా అందాలను ఆరబోస్తున్న అందాల తార రాధికా ఆప్టే. అదే విధంగా ఏ విషయం గురించి అయినా ఎవరికీ భయపడకుండా బోల్డ్‌గా భయటపెట్టగల ధైర్యశాలి కూడా ఈమెనే. సినీ పరిశ్రమలో విజయాలతో కాకుండా కాంట్రవర్సీ స్టేట్ మెంట్స్‌తోనే ఎక్కువగా పాపులర్ అయిన హాట్ బ్యూటీ రాధిక ఆప్టే. తాజాగా తాను మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతోందట. తన కొత్త సినిమాలో లెస్బియన్‌గా నటించేందుకు రాధికా ఆప్టే ఓకే చెప్పినట్టు సమాచారం. 
 
ఈ మూవీకి సంబంధించిన ఫోటోషూట్ ను రీసెంట్ గా పూర్తి చేసినట్టు ఫిలిం వర్గాల టాక్. ఎక్స్ పోజింగ్, కాంట్రవర్సీలు కొత్త కాదు కాబట్టి... అమ్మడు ఈ సినిమాలోనూ రెచ్చిపోయి నటించే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. గతంలో రాధిక నటించిన ఫైర్ సినిమాపై ఎంతో దుమారం చెలరేగింది. మరి దాదాపుగా అదే కాన్సెప్ట్‌తో తెర కెక్కబోతున్న రాధిక ఆప్టే కొత్త సినిమా ఎలాంటి వివాదాలకు దారితీస్తుండో చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu