Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీప్రియ బాటలో ప్రియమణి: త్వరలో మెగాఫోన్ పట్టనున్న గ్లామర్ హీరోయిన్!

శ్రీప్రియ బాటలో ప్రియమణి: త్వరలో మెగాఫోన్ పట్టనున్న గ్లామర్ హీరోయిన్!
, సోమవారం, 30 నవంబరు 2015 (11:59 IST)
హీరోయిన్లు మెగాఫోన్ పట్టిన కాలం ఎప్పుడో వచ్చేసింది. హీరోలతో సమానంగా నటించడమే కాదు.. హీరోలు మాత్రమే కాదు.. తాముకూడా దర్శకులుగా మారుతామని కథానాయికలు ముందుకొస్తున్నారు. తెలుగు విజయనిర్మల, జీవిత రాజశేఖర్.. తమిళంలో శ్రీప్రియ కూడా దృశ్యం సినిమాతో మెగా ఫోన్ పట్టింది. ఇప్పుడు వీరి బాటలోనే నడవడానికి హాట్ బ్యూటీ ప్రియమణి కూడా రెడీ అయిపోతోంది.
 
ఒకప్పుడు తెలుగు - తమిళ భాషల్లో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ప్రియమణి కన్నడంలో చిన్నా చితకా సినిమా చేసుకుంటూ పోతోంది. త్వరలోనే ఈ దర్శకత్వపగ్గాలు కూడా చేపట్టనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం తాను కథలు రాసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు చెప్పింది ప్రియమణి.
 
ఈ మధ్య కన్నడ సూపర్ స్టార్ సుదీప్ నిర్వహించే ‘బిగ్ బాస్’ షోకు గెస్ట్‌గా వచ్చిన ప్రియమణి.. సుదీప్ హీరోగా తన దర్శకత్వంలో ఓ సినిమా చేయాలన్నది తన కల అని వెల్లడించింది. ప్రియమణి ఏదో తమాషాకు అంటోందని అనుకున్నారు కానీ.. తాను నిజంగానే డైరెక్షన్ చేయలన్న ప్లాన్ తో ఉన్నానని.. త్వరలోనే సినిమా కూడా మొదలు కావచ్చని చెప్పి షాకిచ్చింది ప్రియమణి.
 
ముస్తఫా రాజ్ అనే ఓ బిగ్ షాట్‌తో ప్రియమణి ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. ముస్తఫా దగ్గర డబ్బులకు కొదవేమీ లేదు కాబట్టి ప్రియమణి దర్శకత్వం చేపట్టే రోజులు తక్కువే ఉన్నాయని.. అయితే ఈ డైరక్ట్ చేయబోయే సినిమా ఏ భాషలో ఉంటుందనేదే ప్రస్తుతం సస్పెన్స్.

Share this Story:

Follow Webdunia telugu