Prerna Arora: హిందీ లోనే కాక దక్షినాది లో కూడా ఆదరణ పొందుతున్న ప్రేరణ అరోరా

దేవి
సోమవారం, 8 డిశెంబరు 2025 (13:17 IST)
Prerna Arora
భారతీయ చిత్ర నిర్మాత, దర్శకురాలు ప్రేరణ అరోరా. రుస్తుం, టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ వంటి భిన్నమైన సినిమాలు నిర్మించి అందరినీ ఆకట్టుకున్నారు. వీరేందర్ అరోరా కుమార్తె అయిన ఈమె తెలుగులో  జటాధరా అనే సినిమాను నిర్మించారు. ఇంకా పలు సినిమాలు నిర్నిచే ఆలోచనలో ఉన్న ప్రేరణ అరోరా గారి జన్మ్నదినం నేడు. ఈ సందర్భంగా పలువురు ఆమెకు విషెస్ తెలయజేసారు.
 
అదృష్ట సంఖ్యగా ఎప్పటినుంచో ఆమె జీవితంలో ప్రత్యేక స్థానంలో నిలిచిన ‘8’. ఇవాళ డిసెంబర్ 8వ తేదీ ఆమెకు మరింత శుభాన్ని తీసుకు వచ్చింది. కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్న ఈ సందర్భంలో, ప్రేరణ అరోరా గారు భారీ సంస్థ జీ స్టూడియోస్‌తో కలిసి తమ తదుపరి పాన్-ఇండియా అడ్వెంచర్ చిత్రం అధికారికంగా ప్రారంభించారు.
 
‘రుస్తమ్’ మరియు ‘జటాధరా’ విజయాల తర్వాత, ఇది ప్రేరణ అరోరా గారికి జీ స్టూడియోస్‌తో మూడవ సహకారం. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సాల్, శివిన్ నారంగ్ మరియు ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తుండగా, కీర్తన్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
 
ఇదిలా ఉండగా, థియేట్రికల్ రన్‌ను విజయవంతంగా ముగించిన ‘జటాధరా’ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై టాప్ చార్ట్స్‌లో ట్రెండింగ్ అవుతోంది. ‘రుస్తమ్’, ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’, ‘ప్యాడ్ మాన్’, ‘పరీ’ వంటి జాతీయ అవార్డు గెలుచుకున్న మరియు కమర్షియల్ సక్సెస్ సాధించిన హిందీ చిత్రాలతో ప్రేరణ అరోరా గారు బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న యువ మహిళా నిర్మాతగా స్థిరపడ్డారు. ఆమె అభివృద్ధి చేస్తున్న ప్రాజెక్టులు కేవలం హిందీ చిత్రసీమలోనే కాక దక్షిణ భారత ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా విశేష ఆదరణ పొందుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పూటుగా లిక్కర్ సేవించి ర్యాపిడో ఎక్కిన యువతి, సీటు నుంచి జారుతూ... వీడియో వైరల్

Survey: సర్వేలో బాలకృష్ణపై హిందూపూర్ ప్రజలు ఏమంటున్నారు?

రేవంత్ రెడ్డి బెస్ట్ సీఎం అవుతాడనుకుంటే అలా అయ్యారు: వీడియోలో కెఎ పాల్

పులివెందులలో జగన్‌కు ఎదురుదెబ్బ.. వేంపల్లి నుండి టీడీపీలో చేరిన వైకాపా సభ్యులు

Chandrababu: ఇండిగో సంక్షోభం.. స్పందించిన చంద్రబాబు.. ఏమన్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

తర్వాతి కథనం
Show comments