Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికన్ బాయ్‌ఫ్రెండ్‌తో ప్రీతి జింటాకు డుం.. డుం.. డుం..

అమెరికన్ బాయ్‌ఫ్రెండ్‌తో ప్రీతి జింటాకు డుం.. డుం.. డుం..
, సోమవారం, 23 నవంబరు 2015 (14:11 IST)
బాలీవుడ్ సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింటా త్వరలో పెళ్లి కూతురు కాబోతున్నట్లు బిటౌన్‌లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. కొత్త సంవత్సరం జనవరి 2016నఅమ్మడు అమెరికన్ బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లాడనుందని వార్తలొస్తున్నాయి. 
 
పెళ్లయ్యాక అమెరికాలోనే సెటిల్ అవ్వాలని ప్రీతిజింటా భావిస్తోంది. అమ్మడి మ్యారేజ్ ప్రోగ్రామ్ సన్నిహితులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో సింపుల్‌గా జరుగుతుందని.. తర్వాత రిసెప్షన్ గ్రాండ్‌గా నిర్వహించాలని ప్రీతిజింటా కుటుంబీకులు భావిస్తున్నట్లు సమాచారం. 
 
ఇప్పటికే బాయ్ ఫ్రెండ్ కోసం అప్పుడప్పుడు అమెరికా వెళ్లే ప్రీతి జింటా.. మంచి ఫ్రెండ్ అయిన తన బాయ్ ఫ్రెండ్నే భాగస్వామిగా ఎంచుకోవాలనుకుంది. అంతేగాకుండా పెళ్లికి తర్వాత సినిమాలకు కూడా స్వస్తి చెప్పాలని ఈ సొట్ట బుగ్గల సుందరి భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu