Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

''సాహో'' అంటోన్న ప్రభాస్.. త్వరలో ఫస్ట్ లుక్, ట్రైలర్.. సుజిత్‌తో రూ.150 కోట్ల సినిమా

'బాహుబలి' చిత్రంతో జాతీయ నటుడిగా పేరు కొట్టేసిన ప్రభాస్.. బాహుబలి సిరీస్‌కు తర్వాత కొత్త సినిమాలో నటించేందుకు రెడీ అయిపోయాడు. ఐదేళ్ల పాటు బాహుబలి కోసం పనిచేసిన ప్రభాస్ బాహుబలి 2 రిలీజ్ తర్వాత ఏకంగా రె

''సాహో'' అంటోన్న ప్రభాస్.. త్వరలో ఫస్ట్ లుక్, ట్రైలర్.. సుజిత్‌తో రూ.150 కోట్ల సినిమా
, గురువారం, 20 ఏప్రియల్ 2017 (13:35 IST)
'బాహుబలి' చిత్రంతో జాతీయ నటుడిగా పేరు కొట్టేసిన ప్రభాస్.. బాహుబలి సిరీస్‌కు తర్వాత కొత్త సినిమాలో నటించేందుకు రెడీ అయిపోయాడు. ఐదేళ్ల పాటు బాహుబలి కోసం పనిచేసిన ప్రభాస్ బాహుబలి 2 రిలీజ్ తర్వాత ఏకంగా రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు. అంతేకాదు యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో త్రిభాషా చిత్రం చేసేందుకు ప్రభాస్ సిద్ధమైపోయాడు. 
 
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కోసం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఫస్ట్‌లుక్ వారం రోజుల్లో రిలీజ్ కానుంది. రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ''సాహో" అనే టైటిల్‌ను ఖరారు చేశారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఏప్రిల్ 23న ప్రభాస్ సుజిత్ దర్శకత్వంలో నటించనున్న''సాహో'' ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌పై ప్రకటన రానుంది. 
 
ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ ఈ సినిమాను 150 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపుదిద్దుకునే ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ నటించనుందని సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్లూ ఫిల్మ్స్‌లో నటిస్తా... ఎవరైనా ఉపయోగించుకోవచ్చు.. తెలుగు నటి బంపర్ ఆఫర్