Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అందంపై మరింత శ్రద్ధ పెట్టిన జెనీలియా.. మళ్లీ నటించేందుకు సై!

అందంపై మరింత శ్రద్ధ పెట్టిన జెనీలియా.. మళ్లీ నటించేందుకు సై!
, శనివారం, 3 అక్టోబరు 2015 (18:06 IST)
జెనీలియా హాసినిగా తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. ఈమె బాలీవుడ్ హీరో రితీష్ దేశ్ ముఖ్‌ను ప్రేమించి పెళ్లాడింది. ఇటీవలే ఈ దంపతులకు ఓ పండంటి బాబు పుట్టాడు. బాబు పుట్టాక జెనీలియా తన అందం పాడైపోయిందని బాధపడిపోతోంది. బాబు పుట్టిన తర్వాత తన శరీర చాయ నల్లబడిపోయిందని జెనీలియా అంటోంది. ముఖమంతా ప్యాచ్ ప్యాచ్‌గా మారిపోయిందని చెప్తోంది.
 
తన ముఖాన్ని అద్దంలో తానే చూసుకోలేకపోతున్నానని జెనీలియా ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు, వయసుకు మించి కనిపిస్తున్నానని.. అందుకే మళ్లీ అందంగా, యవ్వనంగా కనిపించేందుకు ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నానని వెల్లడించింది. జెనీలియా మళ్లీ నటించేందుకు సిద్ధమవుతోందని వార్తలొస్తున్న తరుణంలో.. జెన్నీ తన అందంపై మరింత శ్రద్ధ పెట్టిందని... మళ్లీ హాసినిగా అలరించేందుకు సై అంటోందని టాక్.

Share this Story:

Follow Webdunia telugu