Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్‌పై నెగటివ్ టాక్: మహేష్ అప్.. సర్దార్ డౌన్ ఎందుకు?

పవన్‌పై నెగటివ్ టాక్: మహేష్ అప్.. సర్దార్ డౌన్ ఎందుకు?
, శనివారం, 3 అక్టోబరు 2015 (12:59 IST)
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై నెగటివ్ టాక్ వస్తోంది. అటు పొలిటికల్, ఇటు సినిమా రంగంలోనూ పవన్‌పై అసంతృప్తి నెలకొంటుంది. ఇంకా పవన్‌ను మహేష్ బాబుతో రాజకీయ పండితులు పోల్చుతున్నారు. టాలీవుడ్‌లో మహేష్ బాబు, పవన్ కల్యాణ్ టాప్ స్టార్లుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య గల పోలికలపై హాట్ హాట్ చర్చ సాగుతోంది. ఆ చర్చ ఏమిటంటే మహేష్ బాబు పాజిటివ్ సైడ్ దూసుకెళ్తుటుంటే.. పవన్ మాత్రం టాక్ తెచ్చుకుంటున్నాడన్నదే. 
 
పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీ పెట్టాడు. ఇంకా ప్రజల కోసం ఏదైనా చేస్తా.. ప్రజలకు అండగా నిలబడుతా.. ప్రభుత్వాల్ని ప్రశ్నిస్తా అంటూ చెప్తున్నా.. పవర్ స్టార్ మాత్రం పూర్తి రాజకీయాల్లో విఫలమయ్యాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ వల్ల ఓ పార్టీ అధికారంలోకి వచ్చిందే తప్ప ప్రజలకు మేలు జరగలేదు అని కూడా టాక్ వస్తోంది. 
 
తాజాగా తమిళనాడులో తెలుగోళ్ల గురించి పోరాడతానని వెనుదిరిగాడనే విమర్శను కొత్తగా ఎదుర్కొంటున్నాడు. అలాగే సినిమాల్లో నటించకుండా ప్రాజెక్టులు డిలే చేస్తూ.. కొత్త కొత్త రైటర్లను దించుతూ సర్దార్‌ను ముందుకెళ్ళకుండా చేస్తూ.. అభిమానులను కూడా హర్ట్ చేస్తున్నాడని సినీ పండితులు అంటున్నారు. దీంతో పవన్‌పై నెగటివ్ టాక్స్ అధికమవుతున్నాయి.
 
అయితే శ్రీమంతుడు మాత్రం మహోన్నతుడు అని పేరు తెచ్చేసుకున్నాడు. అతడు నటించిన శ్రీమంతుడు బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్టయ్యింది. ఆ సినిమా ప్రభావంతో గ్రామాల్ని దత్తత తీసుకునేందుకు ధనవంతులంతా ముందుకొస్తున్నారు. పైగా మహేష్ సినిమాలో ఏం చెప్పాడో అదే బైట కూడా చేసి చూపించాడు. 
 
తెలంగాణ - ఏపీలో ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ రెండిటికి అన్ని వసతుల్ని కల్పించేందుకు నడుం కట్టాడు. ఇలా పాజిటివిటీని ఎక్కువగా ప్రసరిస్తుంటే.. పవన్ మాత్రం కాస్త నెగెటివ్ టచ్ ఇస్తున్నాడు. మరి ఈ టాక్స్‌పై పవన్ కల్యాణ్ ఎలాంటి సమాధానమిస్తారో వేచి చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu