Priyanka: పవన్ కళ్యాణ్ ఎప్పుడూ టెన్షన్ పడేవారు : ప్రియాంక అరుళ్మోహన్

దేవీ
మంగళవారం, 16 సెప్టెంబరు 2025 (14:04 IST)
Pawan Kalyan, Priyanka Arulmohan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 2023 నుంచి సినిమా జర్నీ చేస్తున్న నటి ప్రియాంక అరుళ్మోహన్. సుజిత్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మించిన ఓజీ. సినిమాలో ఆమె నాయికగా నటించింది. ఆమె చుట్టూ కథ తిరుగుతుందని తెలుస్తోంది. ఈనెలలోనే థియేటర్ కు రానున్న చిత్రం ప్రమోషన్ లో ముందుగా ప్రియాంక అరుళ్మోహన్ పాల్గొంది. ఆమె ఈ సినిమా అనుభవాలను, పవన్ తో వున్న మెమెరబుల్ సంఘటను తెలియజేస్తుంది.
 
- పవన్ కళ్యాన్ వున్నారని ఓటీ ఒప్పుకోలేదు. దర్శకుడు కథ చెప్పినప్పుడు అందులో నాయికకు వున్న పాత్ర బాగా నచ్చింది. అందులోనూ వవన్ సార్ తో నటించడం అంటే మామూలు విషయం కాదు. బెంగుళూరులో సినిమాలు చేస్తున్నండగానే ఆయన సినిమాల గురించి ఆయన గురించి వివరాలు తెలుసుకున్నా.
 
- ఆయన క్రింది నుంచి పైకి ఎదిగిన వ్యక్తిగా నాకు అనిపించారు. 2023 నుంచి ఈ సినిమా జర్నీలో వున్నాను. సీన్ అయ్యాక పవన్ సార్ కుర్చీలో పక్కన కూర్చొని వుండేవారు. నన్ను చూడగానే ఓ కుర్చీ వేసి కూర్చో బెట్టారు. అంతేగాక ప్రపంచంలోని పలు విషయాలు ఆయన నాకు చెబుతుండేవారు. ముఖ్యంగా రాజకీయాల్లో మహిళలు కూడా రావాలని, యూత్ వస్తేనే దేశం అభివ్రుద్ధి అవుతుందని అంటుండేవారు.
 
- ఓజీ సినిమా మొదట్లో షూటింగ్ లో పాల్గొంటే గేప్ లో చాలా  టెన్షన్ గా కనిపించేవారు. అటూ ఇటూ తిరుగుతుండేవారు. ఏవోవో ఆలోచించేవారు. కాసేపు పుస్తకాలు చదివేవారు. సాహిత్యం వినేవారు. దర్శకుడిని పిలిచి సీన్  గురించి తెలుసుకుని ప్రాక్టీస్ చేస్తుండేవారు. అలాంటి వ్యక్తి ఎన్నికల తర్వాత చాలా మారిపోయారు.
 
- డిప్యూటీ సి.ఎం. అయ్యాక చాలా సరదాగా షాట్ లో కనిపించేవారు. అప్పట్లో వున్న టెన్షన్ హడావుడి ఇప్పుడు లేదు. చాలా కూల్ గా నవ్వుతూ వుండేవారు. మహిళల పట్ల గౌరవం మరింత పెరిగింది. అదెలాగంటే, ఓ సారి అనుకోకుండా షాట్ గేప్ లో ఆయన బయటకు వచ్చారు. నేను చెట్టుకింద కుర్చీలో కూర్చున్నా. అక్కడ ఒక్క కూర్చీనే వుంది. ఆయన రాగానే వద్దు మీరు కూర్చోండి అంటూ. నేలమీద కూర్చున్నారు. డౌన్ టు ఎర్త్ అంటే ఇదేనని నాకు కళ్ళారా చూసినట్లయింది. ఇలా హీరోతో సినిమాలో నటించడం చాలా ఆనందంగా వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Low Pressure: బంగాళాఖాతంలో నవంబర్ 19 నాటికి అల్పపీడనం

నిద్రపోతున్నప్పుడు భారీ వస్తువుతో దాడి.. టైల్ కార్మికుడు హత్య.. ఎక్కడ?

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - మావోయిస్టుల హతం

తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి: తితిదే మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి సీబీఐ నోటీసులు

Exit polls, జూబ్లిహిల్స్‌లో కాంగ్రెస్, బీహారులో ఎన్డీయే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments