Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్ కల్యాణ్ సిగ్గుపడిపోతున్నాడట.. అదీ రాయ్ లక్ష్మీ ముందు..!

పవన్ కల్యాణ్ సిగ్గుపడిపోతున్నాడట.. అదీ రాయ్ లక్ష్మీ ముందు..!
, శనివారం, 3 అక్టోబరు 2015 (14:16 IST)
పవన్ కల్యాణేంటి సిగ్గుపడటం ఏంటనేగా మీ సందేహం. అవునండి నిజమే. సర్దార్ ఐటమ్ గర్ల్ డ్యాన్స్ చేస్తుంటే పవన్ కల్యాణ్ తెగ సిగ్గుపడిపోతున్నాడట. ఈ సాంగ్ షూట్‌కు సంబంధించిన ఫోటోస్ సామాజిక వెబ్ సైట్లలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటివరకు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ పై వచ్చిన రూమర్స్‌ను పక్కన పెట్టి పవన్ తన సినిమాను స్పీడ్ పెంచాడు. 
 
‘సర్దార్ గబ్బర్‌సింగ్’ షూటింగ్ స్పాట్ నుండి లీక్ అయిన ఫోటోలు వెబ్‌సైట్లలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోల షేరింగ్ అంతా ఇంతా కాదు. ఈ ఐటెమ్ సాంగ్‌లో శాండిల్‌వుడ్ బ్యూటీ లక్ష్మీరాయ్‌ పవన్‌తో ఇరగదీసే స్టెప్స్ వేసిందని యూనిట్ టాక్. పవన్ ఖాకీ డ్రెస్‌, నెక్‌కి రెడ్ టవల్, చేతికి గుబాలించే మల్లెలతో పక్కా మాస్ లుక్‌లో కనిపించి తన అభిమానులలో తన సినిమాపై ఆలోచనలను రెట్టింపుచేస్తున్నాడు. ఇక లక్ష్మీరాయ్ హాట్ లుక్స్ అదిరిపోయాయి. 
 
ప్రస్తుతం నానక్ రామ్‌గూడ‌లోని రామానాయుడు స్టూడియోలో ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ అద్భుతంగా వేసిన సెట్లో ఈపాట షూటింగ్ వేగంగా జరుగుతోంది. తప్పకుండా సర్దార్ సమ్మర్ రేసుకు రెడీ అవుతున్నాడని ఫిలిమ్ వర్గాల్లో టాక్.

Share this Story:

Follow Webdunia telugu