Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బస్టాండ్‌లో పవన్ కళ్యాణ్ 'కాటమరాజు' హడావుడి

హీరో పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న తాజా సినిమా 'కాటమరాజు'. ఈ చిత్రాన్ని డాలీ దర్శకత్వం వహిస్తుంటే... శరద్‌మరార్‌ నిర్మాత. ఇటీవలే ఈ చిత్రం షెడ్యూల్‌ ప్రారంభమైంది. మంగళవారం ఫిలింసిటీలో జరిగింది. వర్షం కారణం

బస్టాండ్‌లో పవన్ కళ్యాణ్ 'కాటమరాజు' హడావుడి
, బుధవారం, 21 సెప్టెంబరు 2016 (15:21 IST)
హీరో పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న తాజా సినిమా 'కాటమరాజు'. ఈ చిత్రాన్ని డాలీ దర్శకత్వం వహిస్తుంటే... శరద్‌మరార్‌ నిర్మాత. ఇటీవలే ఈ చిత్రం షెడ్యూల్‌ ప్రారంభమైంది. మంగళవారం ఫిలింసిటీలో జరిగింది. వర్షం కారణంగా కొన్ని రోడ్లసీన్లు వాయిదా పడ్డాయి. షెడ్యూల్‌ ప్రకారం బుధవారం జూబ్లీ బస్టేషన్‌లో తీస్తున్నారు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు వర్షం పడుతూనే ఉన్నా... 6.30 గంటలకు తెరిపించింది. 
 
అప్పటికే నిదానంగా వస్తున్న చిత్ర యూనిట్‌ను చూసి.. ఈ చిత్రం పవన్‌ కళ్యాణ్‌ది అనుకుని.. ప్యాసింజర్‌తోపాటు.. అభిమానులు కూడా ఒక్కసారిగా పోగయ్యారు.. అయితే పవన్‌ రావడంలేదని తెలుసుకుని.. కాస్త నిరుత్సాహపడినా.. కాసేపు అలా చూస్తుండిపోయారు. కాగా, రాయలసీమ నుంచి.. జూబ్లీ బస్టాండ్‌లో దిగే సన్నివేశాలను ఇక్కడ చిత్రిస్తున్నారు. ఇందులో పవన్‌ కళ్యాణ్ ఉండడు.. ఈ రోజు షెడ్యూల్‌ పూర్తయ్యాక.. మరలా ఫిలింసిటీలో ఆయనపై సన్నివేశాలుంటాయని చిత్ర యూనిట్‌ వెల్లడిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా క్లోజ్ ఫ్రెండ్ కుమార్తెతో నేను ఎలా రొమాన్స్ చేయగలను : సల్మాన్ ఖాన్