Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్ కల్యాణ్- రేణు దేశాయ్‌ మళ్లీ ఒక్కటవుతున్నారా..? అన్నా లెజ్‌నేవా పరిస్థితి ఏంటి?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్- రేణు దేశాయ్‌లు మళ్లీ ఒక్కటవుతున్నారా? అంటే చాలామంది అవుననే సమాధానం ఇస్తున్నారు. పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ఒక ఫోటోను రేణు దేశాయ్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఆ ఫోటో అంటే

పవన్ కల్యాణ్- రేణు దేశాయ్‌ మళ్లీ ఒక్కటవుతున్నారా..? అన్నా లెజ్‌నేవా పరిస్థితి ఏంటి?
, బుధవారం, 31 ఆగస్టు 2016 (18:14 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్- రేణు దేశాయ్‌లు మళ్లీ ఒక్కటవుతున్నారా? అంటే చాలామంది అవుననే సమాధానం ఇస్తున్నారు. పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ఒక ఫోటోను రేణు దేశాయ్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఆ ఫోటో అంటే తనకెంతో ఇష్టమని, ఆ ఫోటో తానే తీశానని చెప్పుకొచ్చింది. పవన్ కళ్లలోని మెరుపు, ఆయన చూపులకు ఫిదా అయిపోతానని రేణు ట్వీట్ చేసింది. పవన్‌తో మాట్లాడానని పవన్‌ను అడిగే ఆయన ఫోటోను షేర్ చేసానని చెప్పింది. 
 
ఇదంతా చూస్తే.. పవన్- రేణు మళ్లీ ఒక్కటవుతారని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ''బద్రి'' సినిమాతో ఒక్కటైన ఈ జంటకు అకిరా, ఆద్య అనే ఇద్దరు పిల్లలున్నారు. ఆపై వ్యక్తిగత కారణాలతో వీరిద్దరు విడిపోయారు. ఆపై పవన్ అన్నా లెజ్‌నేవాను వివాహమాడాడు. పవన్ హైదరాబాదులో ఉంటే.. రేణు ఇద్దరు పిల్లలతో కలిసి పుణెలో నివాసం ఉంటోంది. కానీ చాలాకాలం తర్వాత రేణు దేశాయ్ పవన్‌తో మాట్లాడానని.. ఆయన కళ్లంటే ఇష్టమని సోషల్ మీడియాలో తెలిపింది.
 
పవన్‌కు సంబంధించిన మరికొన్ని ఫోటోస్ కూడా అభిమానులతో షేర్ చేసుకుంటానని రేణు పేర్కొంది. ఈ పోస్టులు, మాటలు చూస్తుంటే.. పాపం రేణు ఇంకా పవన్‌ని మర్చిపోలేదేమో అనిపిస్తోంది. ఫ్యాన్స్ మరికొందరైంతే.. పవన్-రేణు కలుస్తారేమోనని ఆశాభావంతో ఉన్నారన్నారు. కానీ తిరుపతి సభలో పవన్ కల్యాణ్ మాత్రం తన కూతురు క్రిస్టియన్ అని వ్యాఖ్యానించారు. 
 
అన్నా లెజ్‌నేవా-పవన్‌ దంపతులకు పుట్టిన అమ్మాయి.. ఇటీవల చెర్రీకి రాఖీ కూడా కట్టింది. అన్నా లెజ్‌నేవా చీరకట్టుతో శ్రీజ పెళ్లి వేడుకలోనూ మెరిసింది. ఇలా అన్నాతో పవన్ సంబంధం పటిష్టమవుతున్న తరుణంలో, రేణు దేశాయ్ పవన్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుందని.. అంతేగానీ వారిద్దరి మధ్య మళ్లీ సంబంధాలు కలిసే అవకాశం ఉండదని మరికొందరు అంటున్నారు.
 
పవన్ అన్నా లెజ్‌నేవాతో నివసిస్తున్నా.. రేణును అకీరా, ఆద్యలను అప్పుడప్పుడు కలిసివస్తున్నాడు. పిల్లల్ని చూడాలనిపిస్తున్నప్పుడల్లా రేణు ఇంటికి పవన్ వెళ్తున్నారని.. దీంతో సంబంధాలు ఇంకా తెగిపోలేదని కూడా కొంతమంది సినీజనం మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనా.. రేణు మాత్రం పవన్‌ను మర్చిపోలేకపోతుంది. మరి పవన్ రేణు మర్చిపోయాడా..? అన్నాతో హ్యాపీగా ఉంటాడా అనేది స్వయంగా ఆయనే నోరు విప్పితేకానీ తెలియదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓటుకు నోటు కేసు : వ్యక్తిగతంగా హాజరు కండి... స్టీఫెన్‌సన్‌కు కోర్టు ఆదేశం