Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా కుక్కపిల్ల పేరు గబ్బర్... రాయ్ లక్ష్మీ, పవన్‌ ఫ్యాన్స్‌ గుర్రు!

నా కుక్కపిల్ల పేరు గబ్బర్... రాయ్ లక్ష్మీ, పవన్‌ ఫ్యాన్స్‌ గుర్రు!
, మంగళవారం, 6 అక్టోబరు 2015 (21:44 IST)
పవన్‌ కళ్యాణ్ ఫ్యాన్స్‌ నటి లక్ష్మీరాయ్‌పై గుర్రుమంటున్నారు. అదెలాగంటే.. ఆమె అత్యుత్సాహంతో ట్విట్టర్‌లో ఓ సందేశాన్ని పోస్టు చేసింది. తను పవన్‌ కళ్యాణ్‌ సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. దీనికి సంబంధించిన నృత్యాన్ని ఇటీవలే చిత్రీకరించారు. మొదట పవన్‌ సార్‌తో నటించేటప్పుడు నెర్వస్‌గా ఫీలయ్యానని పేర్కొంటూ.. తర్వాత ఆయన చూపిన ప్రోత్సాహంతో బాగా నటించగలిగానని అంది. 
 
చిన్నపాత్ర పోషించినా తనకు ఆ చిత్రం మంచి పేరు తెచ్చిపెడుతుందని పేర్కొంది. ఈ సంతోషాన్ని ట్విట్టర్‌ ద్వారా తెలుపుతూ.. పెట్‌ డాగ్‌తో వున్న ఫొటోను పెట్టేసింది. అక్కడ సెట్లో వున్నంతసేపు.. పెట్ డాగ్‌ను వెంటపెట్టుకునేది. దాని పేరు గబ్బర్‌ అని పిలుచుకునేదాన్నని గొప్పగా చెప్పింది. ఈమె ట్వీట్‌ చేసిన కాసేపటికి పవన్‌ ఫ్యాన్స్‌... చిందులేశారు. సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ పేరులో గబ్బర్‌ను కుక్కపిల్లకు పెట్టి పిలుచుకోవడమేమిటని ఘాటుగా స్పందిస్తూ... కామెంట్లు చేశారు. కానీ రాయ్ లక్ష్మీ పాత్ర గబ్బర్ కుక్కపిల్ల ఫోటోలను అలానే ఉంచేసింది మరి.

Share this Story:

Follow Webdunia telugu