Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రేణూ దేశాయ్‌కి పవన్ హెల్ఫ్ చేశాడా? ఈటీవీ డీల్ వెనక పవర్ స్టార్ హస్తం ఉందా?

రేణూ దేశాయ్‌కి పవన్ హెల్ఫ్ చేశాడా? ఈటీవీ డీల్ వెనక పవర్ స్టార్ హస్తం ఉందా?
, శుక్రవారం, 5 ఫిబ్రవరి 2016 (10:22 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌కి పవర్ స్టార్ తెరవెనుక బాగా సహకరిస్తున్నాడని వార్తలొస్తున్నాయి. పవన్ నుంచి దూరమయ్యాక పిల్లలతో కలిసిపూణేలో ఉంటున్న రేణూ దేశాయ్ నిర్మాతగా మారి ఓ సినిమా తీసింది. ఇష్క్ వాలా లవ్ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా ఓ మరాఠీ మూవీని తెరకెక్కించింది. ఈ సినిమాను ఒకేసారి తెలుగులో కూడా రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ సాధ్యపడలేదు. దీంతో తర్వాత డబ్బింగ్ వెర్షన్‌ని రిలీజ్ చేద్దామని రేణూ దేశాయ్ భావించింది. 
 
కానీ ఒరిజినల్ మూవీ ఫ్లాప్ అవడంతో అదికూడా జరగలేదు. నిజానికి మరాఠీ వెర్షన్ రిలీజ్ కాకముందు.. తెలుగులో కూడా మంచి అంచనాలే ఉన్నాయి. దీనికి కారణం.. పవన్ కుమారుడు అకీరా నందన్ ఈ మూవీతో తెరంగేట్రం చేయడమే. తాజాగా ఈ సినిమాపై రేణూదేశాయ్ ట్వీట్ చేసింది. 'అందరికీ హెలో నాకు ఆరోగ్యం బాగోని కారణంగా ఇష్క్ వాలా లవ్ను థియేటర్లలో రిలీజ్ చేయలేకపోతున్నాను. కానీ ఈటీవీలో శాటిలైట్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ చేయనున్నాం. త్వరలో టైం డేట్ ప్రకటిస్తా' అంటూ రేణూ దేశాయ్ ట్వీట్ చేసింది.  
 
ప్రస్తుతం ఇష్క్ వాలా లవ్ శాటిలైట్ హక్కులు ఈటీవీ దగ్గర ఉన్నాయి. ఫ్లాప్ సినిమా అయినా సరే.. ఈ డీల్ కుదర్చడంలో పవన్ హ్యాండ్ ఉందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈటీవీ గ్రూప్ అధినేత రామోజీరావుకు పవన్ కళ్యాణ్‌కు సన్నిహిత సంబంధాలు ఉండడంతో.. ఇలా తన మాజీ భార్య మూవీని తగినంత రేటుకే శాటిలైట్ ప్రీమియర్‌గా ప్రదర్శించేలా డీల్ కుదిర్చాడని సినీ జనం అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu