Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సూటు బూటులో...సరికొత్త స్టైల్లో ఎన్టీఆర్ అదుర్స్..

సూటు బూటులో...సరికొత్త స్టైల్లో ఎన్టీఆర్ అదుర్స్..
, మంగళవారం, 7 జులై 2015 (11:10 IST)
టాలీవుడ్‌లో ఒక్కో సినిమాకు ఒక్కో స్టైల్‌‌ కనిపిస్తున్న యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్. టెంపర్ చిత్రంలో షర్టు విప్పేసి హాట్ బాడీ చూపిస్తూ అభిమానులను ఆకట్టుకున్న ఎన్టీఆర్ తాజా చిత్రంలో సూటు బూటు ధరించి, సరికొత్త స్టైల్లో కనిపిస్తున్నాడు. సుమార్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. 
 
ఈ సినిమా షూటింగ్ సోమవారం లండన్‌లో ప్రారంభమైంది. సెప్టెంబర్ 20 వరకు భారీ షెడ్యూల్‌ను అక్కడే నిర్వహిస్తారు. ఈ షెడ్యూల్‌లో చిత్రానికి సంబంధించిన పలు కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తారు. ఆ తర్వాత మరో 20 రోజుల పాటు హైదరాబాద్‌లో షూటింగ్ ఉంటుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu