Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'నేను నీ అభిమానిని, నువ్వు బాగా నటిస్తావ'ని ఎన్టీఆర్ కితాబిచ్చాడు: నిత్యామీనన్

'నేను నీ అభిమానిని, నువ్వు బాగా నటిస్తావ'ని ఎన్టీఆర్ కితాబిచ్చాడని మలయాళ కుట్టి నిత్యామీనన్ చెపుతోంది. పైగా, జూనియర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం జనతా గ్యారేజ్‌లో తాను కూడా మెయిన్ హీరోయిన్‌ అని వివరణ

'నేను నీ అభిమానిని, నువ్వు బాగా నటిస్తావ'ని ఎన్టీఆర్ కితాబిచ్చాడు: నిత్యామీనన్
, గురువారం, 1 సెప్టెంబరు 2016 (08:15 IST)
'నేను నీ అభిమానిని, నువ్వు బాగా నటిస్తావ'ని ఎన్టీఆర్ కితాబిచ్చాడని మలయాళ కుట్టి నిత్యామీనన్ చెపుతోంది. పైగా, జూనియర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం జనతా గ్యారేజ్‌లో తాను కూడా మెయిన్ హీరోయిన్‌ అని వివరణ ఇచ్చారు. 
 
జనతా గ్యారేజ్ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న విషయం తెల్సిందే. దీనిపై నిత్యామీనన్ స్పందిస్తూ... జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో ఏదైనా విషయం చెబితే దానిపై మంచి ఇంపాక్ట్ ఉంటుందన్నారు. ఎన్టీఆర్‌తో నటించడం ఆనందంగా ఉందని చెప్పింది. ముంబైలో తమ మధ్య తొలిషాట్ చిత్రీకరణ జరిగిందని, ఈ సందర్భంగా డైలాగ్ చెప్పడానికి ముందు...'నేను నీ అభిమానిని, నువ్వు బాగా నటిస్తావ'ని జూనియర్ ఎన్టీఆర్ కితాబునిచ్చాడని గుర్తు చేసుకుంది.
 
దీంతో తమ మధ్య మంచి ఆహ్లాదకర వాతావరణం ఏర్పడిందని తెలిపింది. ఇది సినిమాలో సులువుగా నటించేందుకు ఉపయోగపడిందని నిత్యా తెలిపింది. ఈ సినిమా అభిమానులపై మంచి ప్రభావం చూపుతుందని విశ్వాసం వ్యక్తం చేసింది. దీనికి కారణం కొరటాల శివ రూపొందించిన కథ అని చెప్పింది. కొరటాల శివ కథ, కథనం ప్రతి ఒక్కరినీ కదిలిస్తాయని చెప్పింది. ఎలాంటి అంశాన్నైనా సరళంగా చెప్పడంలో కొరటాల శివది ప్రత్యేకశైలి అని నిత్యామీనన్ తెలిపింది.
 
అలాగే, సమంత, తాను మంచి స్నేహితులమని చెప్పుకొచ్చింది. షూటింగ్ సమయంలో తమ మధ్య ఎన్నో విషయాలపై చర్చ జరిగేదని చెప్పింది. ప్రధానంగా గాసిప్స్ పై చర్చ జరుగుతుందని చెప్పింది. తనపై పెద్దగా గాసిప్స్ ఉండవు కనుక... అందరి గాసిప్స్ గురించి చర్చించుకుని నవ్వుకుంటామని తెలిపింది. 
 
ఇక తమ మధ్య ఎలాంటి సమస్యలు లేవని తెలిపింది. మోహన్ లాల్ జాతీయ నటుడని చెప్పింది. ఆయన కళ్లు తీక్షణంగా ఉంటాయని, అవే సగం డైలాగుల్ని కన్వే చేస్తాయని చెప్పింది. దేశంలోని అద్భుతమైన నటుల్లో ఆయన ఒకరని చెప్పింది. ఆయనతో నటించడం గర్వకారణంగా ఉందని తెలిపింది. అలాంటి వ్యక్తితో నటించడం వల్ల నటన ఎంతో మెరుగవుతుందని ఆమె పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిఖిల్‌తో డ్యాన్స్ చేయలేను... శృతిహాసన్ :: నేను రెఢీ అంటూ ముందుకొచ్చిన తమన్నా.. ఖాతాలోకి రూ.2 కోట్లు