Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిండు పున్నమి లాంటి ‘ఒక మనసు’... జూన్ 24 న విడుదల(Video)

నిహారిక కొణిదెల, నాగశౌర్య జంటగా, TV 9 సమర్పణలో, మధుర ఎంటర్టైన్‌మెంట్ పతాకంపై రామరాజు దర్శకత్వంలో మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించిన ఒక మనసు చిత్రం జూన్ 24న విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవలే మెగా హీరోల చేతుల మీదుగా విడుదలైన పాటలకు శ్రోతల నుండి విశేష స్పందన ల

నిండు పున్నమి లాంటి ‘ఒక మనసు’...  జూన్ 24 న విడుదల(Video)
, గురువారం, 26 మే 2016 (17:47 IST)
నిహారిక కొణిదెల, నాగశౌర్య జంటగా, TV 9 సమర్పణలో, మధుర ఎంటర్టైన్‌మెంట్ పతాకంపై రామరాజు దర్శకత్వంలో మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించిన ఒక మనసు చిత్రం జూన్ 24న విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవలే మెగా హీరోల చేతుల మీదుగా విడుదలైన పాటలకు శ్రోతల నుండి విశేష స్పందన లభిస్తోందని, సినిమా ఫస్ట్ లుక్ మొదలుకుని ఇటివలే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ వరకూ ప్రేక్షకుల నుంచి లభిస్తున్న అనూహ్యమైన స్పందన తమకెంతో ఆనందాన్ని కలిగిస్తుందని చిత్ర నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి తెలిపారు. 
 
ఇప్పటి రొటీన్ చిత్రాలకి భిన్నంగా ఒక హృద్యమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రంలో నిహారిక, నాగశౌర్యల నటన ఆకట్టుకుంటుందనీ, ప్రేమ, కుటుంబం, బాధ్యతలు వాటి విలువలు లాంటి అంశాలతో ముడిపడి వున్న ఈ ఒక మనసు సినిమా ప్రతి మనసుని అలరిస్తుందని, సునీల్ కశ్యప్ బాణీలు అందించిన ఈ చిత్రాన్ని జూన్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు రామరాజు తెలిపారు.
 
ఒక మనసు ట్రెయిలర్ వీడియో చూడండి...
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రుతి హాసన్ మరీ ఇలా చావగొట్టేసిందేంటి...? న్యూడ్ వీడియో కూడానా...?