Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రియాల్టీ షోకు హోస్ట్‌గా నవదీప్.. అవకాశాలు రాకపోవడంతో యాంకర్ అవతారం?!

వైజయంతి టెలిఫిలిమ్స్‌పై స్వప్నదత్ నిర్మిస్తున్న ఓ రియాల్టీషోకి నవదీప్ హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే బ్రహ్మోత్సవం సినిమా ఆడియో కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరించిన నవదీప్ చందమామ సినిమాకు తర్వాత

రియాల్టీ షోకు హోస్ట్‌గా నవదీప్.. అవకాశాలు రాకపోవడంతో యాంకర్ అవతారం?!
, గురువారం, 23 జూన్ 2016 (12:12 IST)
వైజయంతి టెలిఫిలిమ్స్‌పై స్వప్నదత్ నిర్మిస్తున్న ఓ రియాల్టీషోకి నవదీప్ హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే బ్రహ్మోత్సవం సినిమా ఆడియో కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరించిన నవదీప్ చందమామ సినిమాకు తర్వాత సినీ పరిశ్రమలో యంగ్ హీరోగా పేరు సంపాదించాడు. కెరీర్‌లో బెస్ట్ అవకాశాలు ఆపై దక్కకపోయినా.. ఇప్పటివరకు అతను నటించిన సినిమాల్లో ఆర్య 2నే బెస్ట్ అని చెప్పవచ్చు. 
 
మే 13న విడుదలైన 'అజార్' మూవీ లో ఇతను కామియో రోల్‌లో కనిపించాడు. అంతేకాకుండా ఇతను కొన్ని తమిళ సినిమాల్లోనూ ఇతను నటించాడు. దక్షిణాదిన హీరో పాత్రలే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ రాణించే నవదీప్.. తాజాగా హోస్ట్‌గా వ్యవహరించే ఓ రియాల్టీ షోలో 15 మంది టాలీవుడ్ ముద్దుగుమ్మలు సాహసాలు చేయనున్నారు. తప్పకుండా ఈ షో ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకోనుందని తెలిసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శభాష్ నాయుడు ఎఫెక్ట్ : శ్రుతిహాసన్ మల్టీట్యాలెంటెడ్ గర్ల్.. బ్రహ్మానందం కితాబు..!