Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహేష్-రాజమౌళి సినిమాలో నారాయణ: హీరోయిన్‌గా నయనతార

మహేష్-రాజమౌళి సినిమాలో నారాయణ: హీరోయిన్‌గా నయనతార
, మంగళవారం, 25 ఆగస్టు 2015 (12:26 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు, బాహుబలి మేకర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమాలో ప్రొడ్యూసర్ కెఎల్ నారాయణ కూడా చేతులు కలిపారు. రాఖీ, సంతోషం, హలో బ్రదర్, క్షణ క్షణం, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు వంటి క్రేజీ సినిమాలకు నిర్మాణ సారథ్యం వహించిన నారాయణ మహేష్ బాబు-రాజమౌళి సినిమాను శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌లో నిర్మించేందుకు రెడీ అయ్యారు. 
 
సూపర్ స్టార్ మహేష్- రాజమౌళి కాంబినేషన్‌లో రూపుదిద్దుకోనున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో రాజమౌళి బాహుబలి సీక్వెల్ (బాహుబలి: ది కన్‌క్లూజన్) పనుల్లో బిజీ బిజీగా ఉండటం, మహేష్ బాబు సైతం బ్రహ్మోత్సవం షూటింగ్ పనుల్లో ఉండటం ద్వారా.. వీరిద్దరూ తమ కమిట్‌మెంట్లను పూర్తి చేసుకున్నాక.. కొత్త ప్రాజెక్టుపై దృష్టి పెడతారని తెలుస్తోంది. రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్ ఫిలిమ్‌లో భారీ తారాగణం ఉంటుందని.. హీరోయిన్‌గా నయనతార పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu