Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

Advertiesment
malavika mohanan

ఠాగూర్

, ఆదివారం, 10 ఆగస్టు 2025 (19:24 IST)
వైవిధ్యమైన కథలు, పాత్రలతోనే కాదు, తనదైన నటనతోనూ యువతను అలరిస్తున్న నటుడు నేచురల్ స్టార్ నాని. ఇప్పుడు మరో గుర్తింపును కూడా తన ఖాతాలో వేసుకున్నారు. 2025 దక్షిణాది నటుల్లో హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును సొంతం చేసుకున్నారు. యూజెనిక్స్‌ ఫిల్మ్‌ఫేర్‌ గ్లామర్‌ అండ్‌ స్టైల్‌ అవార్డ్స్‌ సౌత్‌ 2025 వేడుక తాజాగా జరిగింది. పలువురు సినీతారలు ఇందులో పాల్గొని సందడి చేశారు.
 
ఇకపోతే, దక్షిణాది వినోద రంగంలో గ్లామర్‌, స్టైలిష్ పర్సనాలిటీస్‌కు తొలిసారిగా ఈ అవార్డులను ప్రకటించారు. మోస్ట్‌ గ్లామరస్‌ యూత్‌ ఐకాన్‌ అవార్డును రాశీఖన్నా అందుకుంది. తరాలు మారినా తరగని అందం, స్టైల్‌తో యువత కథానాయకులు పోటీగా నిలిచిన అగ్ర కథానాయకుడు చిరంజీవి స్టైల్‌ ఐకాన్‌ డౌన్‌ ది ఇయర్స్‌ అవార్డుకు ఎంపికయ్యారు. అలాగే స్టార్‌ ఫర్‌ ఆల్‌ సీజన్స్‌ అవార్డు వెంకటేశ్‌కు దక్కింది. మోస్ట్‌ స్టైలిష్‌ ఐకాన్‌ అండ్‌ స్టార్‌గా అల్లు అర్జున్‌ నిలిచారు.
 
ట్రైల్‌బ్లేజర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ - చిరంజీవి
ట్రెండ్‌ సెట్టర్‌ ఆఫ్‌ ది ఇయర్‌- అల్లు అర్జున్‌
మోస్ట్‌ గ్లామరస్‌ యూత్‌ ఐకాన్‌ (మేల్‌)- విజయ్‌ దేవరకొండ
మోస్ట్‌ గ్లామరస్‌ యూత్‌ ఐకాన్‌ (ఫిమేల్‌)- రాశీఖన్నా
మోస్ట్‌ ఫ్యాషనబుల్‌ స్టార్‌ - విజయ్ దేవరకొండ
హాట్‌స్టెప్పర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ (మేల్)- అడవి శేష్‌
హాట్‌స్టెప్పర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ (ఫిమేల్‌)- మాళవిక మోహనన్‌
ఫ్యాషన్‌ ఫార్వర్డ్‌ స్టార్‌ - సిద్ధార్థ్‌
విమెన్‌ ఆఫ్ స్టైల్‌ అండ్‌ సబ్‌స్టాన్స్‌ -అదితి రావ్‌ హైదరి
ఫిట్‌ అండ్‌ ఫ్యాబులస్‌ (మేల్‌)- నవీన్‌ పొలిశెట్టి
ఫిట్‌ అండ్‌ ఫ్యాబులస్‌ (ఫిమేల్‌) -ప్రగ్యా జైశ్వాల్‌
ఫ్యాషన్‌ రిస్క్‌టేకర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ - లక్ష్మీ మంచు
స్టైల్‌ ఐకాన్‌ (ఫిమేల్‌)- రాశీఖన్నా
రెడ్‌ కార్పెట్‌ లుక్‌ ఆఫ్ ది ఇయర్‌(మేల్‌)- సందీప్‌ కిషన్‌
రెడ్‌ కార్పెట్‌ లుక్‌ ఆఫ్ ది ఇయర్‌(ఫిమేల్‌)- భాగ్యశ్రీ బోర్సే
ఎమెర్జింగ్‌ ఫేస్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ (మేల్‌) - తేజ సజ్జా
ఎమెర్జింగ్‌ ఫేస్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ (ఫిమేల్‌) -భాగ్యశ్రీ బోర్సే
మోస్ట్‌ స్టైలిష్‌ డైరెక్టర్‌ -అనిల్‌ రావిపూడి
మోస్ట్‌ స్టైలిష్‌ మూవీ మొగల్‌ -నాగ వంశీ
అల్టిమేట్‌ దివ సింగర్‌ -చిన్మయి శ్రీపాద
అల్టిమేట్‌ మావెరిక్‌ మ్యూజిషియన్‌ -దేవిశ్రీ ప్రసాద్‌
డేర్‌ టు బి డిఫరెంట్‌ - అల్లు శిరీష్‌
మోస్ట్‌ డిజైరబుల్‌ స్టార్‌- సాయి ధరమ్‌ తేజ్‌ 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)